
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Vizag Steel Plant Accident Kumaraswamy Announces Rs 25 Lakhs: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన భారీ ప్రమాదంలో మరుగుతున్న ఉక్కుపై పడటంతో ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 1500 డిగ్రీల వేడి కలిగిన ఈ ఉక్కు ఒక్కసారిగా కార్మికులపై పడటంతో వారు కాలి బూడిదయ్యారు. ఈ సంఘటన స్థలంలో అత్యంత విషాదకర దృశ్యాలు కనిపించాయి. తీవ్రంగా గాయపడిన మరికొందరిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి త్వరితగతిన నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడంతో పాటు, సోమవారం రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష కూడా చేపట్టారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి కుమారస్వామితో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం చేయాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని విశాఖ కలెక్టర్ సీఎంకు వివరించారు.
ఈ సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించిన కేంద్ర మంత్రి కుమారస్వామి, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే మరణించిన వారి కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ఉపాధి కల్పించేందుకు హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణాల పై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. నిన్న కుమారస్వామితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్లాంట్‌ను సందర్శించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
ప్రమాదం ఎలా జరిగింది అంటే... విశాఖ ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలో ఉన్న సీసీడీ విభాగంలో పనులు జరుగుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. లోపల ఉన్న ద్రవం అకస్మాత్తుగా కింద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనివల్ల అక్కడ ఉన్న కార్మికులు క్షణాల్లో కాలి బూడిదయ్యారు. యంత్రాలు, పరికరాలు కూడా ఈ వేడికి కరిగిపోయాయి. ప్రాథమికంగా 8 మంది మరణించగా, ఆ తర్వాత మరో ఇద్దరు మృతి చెందారు. స్టీల్ మెటల్ లిక్విడ్ లాడల్ నుండి 1500 డిగ్రీల వేడి ద్రవం ఒలికిపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి... విశాఖ ఉక్కు ప్లాంట్‌లోని ఈ ప్రమాదానికి ప్రధానమంత్రి మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేయడమే కాకుండా, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక అధికారులకు అవసరమైన సహాయం చేయాలని సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ (PMNRF) నుండి ఒక్కొక్కరికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 పరిహారాన్ని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.