మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ నటి టబు
, కన్నడ నటుడు దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ & ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ ను లాంచ్ చేశారు. ‘‘ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా’’ అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో బిచ్చగాడిగా సేతుపతి.. పోలీసాఫీసర్ పాత్రలో టబు కనిపించారు. దునియా విజయ్ విలన్ రోల్ ప్లే చేశారు. జరీనా వహాబ్, వీటీవీ గణేష్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ టీజర్లో హీరో ఎంట్రీ సీన్ దగ్గర నుంచి.. డైలాగ్స్, ఫైట్స్ వరకూ పూరి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ సేతుపతి తన సొంత వాయిస్ తో డైలాగ్స్ చెప్పడం గమనార్హం. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. పూరీ టేకింగ్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఓవరాల్ గా పూరీ ఈజ్ బ్యాక్ అనేలా ఈ టీజర్ ఉంది.పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణరావు నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రం విడుదల కానుంది.