
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్, బ్లాక్‌బస్టర్ మూవీ దురంధర్. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది రివెంజ్ సైతం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం
Jun 8 2026 6:40 PM | Updated on Jun 8 2026 6:40 PM
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్, బ్లాక్‌బస్టర్ మూవీ దురంధర్. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ది రివెంజ్ సైతం బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఈ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. ఆర్ మాధవన్ కీలక పాత్రలో మెప్పించారు. ఈ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
తాజాగా ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యుకు హాజరైన మాధవన్ తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడారు. ఎంతోమంది అందమైన హీరోయిన్లతో తాను పనిచేశానని వెల్లడించారు. అయితే ఎప్పుడు తాను ఎవరితో రిలేషన్ పెట్టుకోలేదన్నారు. ఈ విషయంలో తన వైఫ్‌ను ఎప్పుడు మోసం చేయలేదని తెలిపారు. ఎందుకంటే తన జీవితంలో వైవాహిక బంధానికి ఎక్కువ విలువ ఇస్తానని మాధవన్ వెల్లడించారు.
కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే తనకిష్టమని ఆర్ మాధవన్ తెలిపారు. ఇదంతా తాను పాత తరం నుంచే నేర్చుకున్నానని.. సతీమణితో విధేయతగా ఉండడం మా బ్లడ్‌లోనే ఉందన్నారు. షూటింగ్ పూర్తికాగానే ఇంటికి వెళ్లి నా భార్యను హత్తుకున్నప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించారు. ఎందుకంటే నేను భార్యకు భయపడే మధ్యతరగతి వ్యక్తినన సరదాగా మాట్లాడారు. తన భార్య సరితనే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని వెల్లడించారు. తన ఫోన్, బ్యాంక్ లావాదేవీలు కూడా ఆమెనే చూస్తుంటారని పంచుకున్నారు. కాగా.. 1993లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్ మాధవన్.. 1999లో సరితను వివాహం చేసుకున్నారు.
తన ముద్దుల గారాలపట్టితో బిగ్‌బాస్ శివజ్యోతి బొబ్బట్ల పండుగ (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
బాబు మీటింగ్ అట్టర్ ప్లాప్ తిట్టుకుంటూ వెళ్లిపోయిన జనం
నందు ఎంత రాక్షసి అంటే..?కడుపుతో ఉన్న అమ్మాయి పని చేయడానికి వస్తే
Breaking News: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
నందూస్ వరల్డ్ కపుల్స్ పాస్ పోర్ట్ రద్దు..!