
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ (Iran) ప్రకటించింది. ఒకవేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ (Israel) దాడులను కొనసాగిస్తే.. తాము మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది
. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని.. శాంతి, సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఐఆర్జీసీ ఈ ప్రకటన చేసింది. సోమవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన పలు డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని వెల్లడించింది.
దేశ రక్షణ కోసం ఎటువంటి ముప్పును అయినా ఎదుర్కొంటామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ (Pezeshkian) పేర్కొన్నారు. దౌత్యం, రక్షణ అనేవి జాతీయ శక్తికి రెండు రెక్కల వంటివని అన్నారు. యుద్ధరంగం నుండి గానీ.. చర్చల నుంచి కానీ తాము వైదొలగలేదని వెల్లడించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. చాలా అనుమానాల మధ్య తమ అధికారులు అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్నారని.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ అగ్రరాజ్యానికి తెలిసి జరిగినా తెలియకుండా జరిగినా వాటి వల్ల చర్చల ప్రక్రియకు అంతరాయం కలుగుతుందన్నారు. శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్న సమయంలో ఈ దాడులు చేపట్టడం సరైన చర్య కాదన్నారు. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టే ఏ చర్యకైనా అమెరికానే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాగా ఇరాన్‌లోని ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ ఆ దేశం బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడానికి వినియోగిస్తోందని ఆరోపిస్తూ.. ఇజ్రాయెల్ ఆదివారం టెహ్రాన్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్‌పై చేసింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని పెట్రోకెమికల్ ప్లాంట్ ఐఆర్జీసీ దాడి చేసింది. దీంతో ట్రంప్ ఇరుదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఆపి..చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ తాజా ప్రకటన చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.