అన్నం, పనీర్ ముక్కలు, క్యారెట్లు, బీన్స్, క్యాప్సికమ్, సోయా సాస్, మిరియాల పొడి, ఉల్లిపాయలు, ఉప్పు. ముందు బియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి. పొడిపొడిగా అన్నం ఉంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది
.
పనీర్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది ఫ్రైడ్ రైస్‌కి ముఖ్యమైన పదార్థం.
బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్లు, ఉల్లిపాయ ముక్కలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇంకేమైనా కూరగాయలు కావాలంటే కూడా యాడ్ చేసుకోండి.
పాన్‌లో నూనె లేదా బట్టర్ వేసి వేడి అయ్యాక కూరగాయల్ని హై ఫ్లేమ్‌పై తేలికగా వేయించుకోండి.
వేయించిన కూరగాయల్లో పనీర్ ముక్కల్ని కూడా వేసేసి రెండు నిమిషాల పాటు కలిపి ఉడికించుకోండి.
ఇందులో మిరియాల పొడి, ఉప్పు, సోయా సాస్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు చల్లారిన అన్నాన్ని వేస్తూ కలుపుతూ బాగా కలిసేలా చూడండి.
హై ఫ్లేమ్‌పై రెండు నిమిషాలు ఫ్రై చేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది.