
సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయమానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విజయవాడలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సోమవారం ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాజకీయ
Jun 8 2026 2:56 PM | Updated on Jun 8 2026 3:06 PM
సాక్షి, విజయవాడ: మాజీ ఎంపీ కేశినేని నాని జాతీయమానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విజయవాడలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సోమవారం ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే తన స్నేహితుడైన తానినేని రాంబాబుపై పోలీసులు తీవ్రస్థాయిలో వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే రాంబాబు, ఆయన తల్లిని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని సిటీ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తన పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే కంటి ,గుండె సంబంధింత ఆపరేషన్ చేయించుకున్న రాంబాబును విచారణపేరుతో 11గంటల పాటు అక్రమంగా పటమట పోలీస్ స్టేషన్లో నిర్భంధించారని పేర్కొన్నారు.
ఈనెల 5వ తేదీన రాంబాబు కంటి ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటుండగా పోలీసులు కనీస మానవత్వం సైతం లేకుండా వరుసగా మూడు రోజులు 6,7,8 ఆయనను పోలీసు స్టేషన్లో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి పోలీసులు వ్యవహరిస్తున్నారని పోలీసుల చర్యలతో ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
బ్లాక్ డ్రెస్‌లో ప్రియాంక మోహన్ స్టన్నింగ్ స్టిల్స్
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
విజయ్ కి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం!
నందు దంపతులకు జైలు శిక్ష? న్యాయవాది సంచలన కామెంట్స్
బస్సును చీల్చుకెళ్లిన లారీ ముగ్గురు ఏపీ వాసుల మృతి..
చంద్రబాబు గుట్టు రట్టు.. రైతులకు టోకరా పెట్టి నారా బ్రాహ్మణి పేరుతో భూములు
మృగశిర కార్తె స్పెషల్.. కిక్కిరిసిన చేపల మార్కెట్లు