
ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఫాలోఆన్‌లో టీ బ్రేక్ సమయానికి 29 ఓవర్లు ఆడిన అఫ్గాన్.. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పూర్ వేదికగా అఫ్గానిస్థాన్-భారత్ జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. 113/5తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్.. 152 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో అఫ్గాన్‌తో ఫాలోఆన్ ఆడిస్తోంది. ఫాలోఆన్‌లో టీ బ్రేక్ సమయానికి 29 ఓవర్లు ఆడిన అఫ్గాన్.. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అఫ్సర్ జాజాయ్(4*) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో చెలరేగాడు. సిరాజ్, కుల్దీప్ తలొక వికెట్ పడగొట్టారు. అఫ్గానిస్థాన్ ఇంకా 314 పరుగుల భారీ తేడాతో వెనుకంజలో కొనసాగుతోంది.
అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గాన్.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. రహ్మత్ షా(60) అర్ధ శతకం చేశాడు. టెస్టుల్లో భారత్‌పై అర్ధ శతకం చేసిన తొలి అఫ్గాన్ క్రికెటర్‌గా అతడు ఘనత సాధించాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్(6/33) సత్తా చాటాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 564/8 వద్ద డిక్లేర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
వైభవ్ ఏం చేస్తాడో.. నాకైతే డౌటే: ఏబీ డివిలియర్స్