
ఆగస్టు 15వ తేదీ నాటికి సంజీవని పథకం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా, జూన్8
(ఆంధ్రజ్యోతి): ఆగస్టు 15వ తేదీ నాటికి సంజీవని పథకం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈరోజు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ రెండున్నర లక్షలతో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకువస్తామని తెలిపారు. వచ్చే బస్సులన్నీ ఎలక్ట్రిల్ , ఏసీ బస్సులు వస్తున్నాయని వివరించారు. భవిష్యత్తు ఎన్నికల్లో వైసీపీ నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు
16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల
Read AP News Latest And Telangana News And National News