
ఇంటర్నెట్‌డెస్క్: బంధువులతో కలిసి రెస్టరంట్లో భోజనం చేసి, ఆ తర్వాత బయట ఆడుకుంటున్న ఓ టీనేజర్ అకస్మాత్తుగా కుప్పకూలిపడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది
. గుండెపోటు వల్లే ఆమె మరణించి ఉండొచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు (Teenager Sudden Collapse).
గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల టీనేజర్ ఆనంది మోదీ.. వేసవి సెలవుల్లో రాజ్‌కోట్‌లోని తన మేనమామ ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం ఆ కుటుంబసభ్యులంతా కలిసి రెస్టరంట్‌కు వెళ్లారు. భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చిన ఆనంది.. అక్కడ ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంది. ఆ క్రమంలోనే పరిగెత్తుతూ ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం దక్కలేదు. ప్రాథమికంగా గుండెపోటు కారణం కావొచ్చని భావిస్తున్నా.. పోస్ట్‌మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. గతంలోనూ ఇలా పిల్లలు ఆడుకుంటూ కుప్పకూలిన ఘటనలు జరిగాయి. 2024లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన ఒక పాఠశాలలో జరిగిన క్రీడల పోటీల్లో పాల్గొన్న టీనేజర్ మోహిత్ చౌధరీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. అదే ఏడాది అలీగఢ్‌లో 20 ఏళ్ల మమత పరిగెడుతూ ఇలాగే మృతి చెందింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.