
ఇంటర్నెట్ డెస్క్: తానెప్పుడూ భార్యను మోసం చేయలేదని నటుడు మాధవన్ సరదాగా చెప్పారు. జూన్ 6న వివాహ వార్షికోత్సవం చేసుకున్న ఆయన (R. Madhavan) కొన్ని సరదా సన్నివేశాలను ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. తాను
ఎంతోమంది అందమైన నటీమణులతో పనిచేసినప్పటికీ.. తన జీవితం, తాను ఎక్కువగా విలువనిచ్చే తన వైవాహిక బంధం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు.
‘‘కుటుంబసభ్యులతో ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండాలనేది మా పూర్వీకుల నుంచే నేర్చుకున్నాను. భార్యతో విధేయతతో ఉండడం మా కుటుంబంలోనే ఉంది. నేను ఎంతోమంది అమ్మాయిలు ఉండే పరిశ్రమలో వర్క్ చేస్తున్నాను. ఆ పేరుతో వేరే కారణాలు చెప్పి బయట తిరగడం కంటే.. షూటింగ్ పూర్తికాగానే ఇంటికి వెళ్లి నా భార్యను హత్తుకున్నప్పుడే నాకు ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే నేను భార్యకు భయపడే మధ్యతరగతి వ్యక్తిని’’ అని మాధవన్ సరదాగా చెప్పారు. తన భార్య సరితనే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటారని వెల్లడించారు. తన ఫోన్, బ్యాంక్ లావాదేవీలు కూడా ఆమెనే చూస్తుంటారని తెలిపారు.
తనకు హీరోగా గుర్తింపు వస్తోన్న సమయంలో కొందరు తనకు పెళ్లయిన విషయం బయటకు చెప్పొద్దని సలహా ఇచ్చారని మాధవన్ వెల్లడించారు. తాను మాత్రం వాళ్లు చెప్పినదానికి భిన్నంగా వ్యవహరించినట్లు చెప్పారు. ‘‘నాకు అభిమానులు చేసే మెసేజ్‌లు, మెయిల్స్ అన్నీ సరితతో కలిసి ఓపెన్ చేసేవాడిని. విదేశాల్లో షూటింగ్‌కు ఆమెను నాతో తీసుకెళ్లేవాడిని’’ అని తెలిపారు. 1993లో ఇండస్ట్రీకి వచ్చిన మాధవన్ 1999లో వివాహం చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్’.