
ఇంటర్నెట్ డెస్క్: డొమినికన్ రిపబ్లిక్లోని లా రొమానా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన
వెంటనే అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే వారు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. విమానం కూలడానికి ముందు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఫ్లైట్ డేటాను సమీక్షిస్తున్నారు. ఆ ప్రైవేట్ జెట్ ఎవరిది.. ఎక్కడికి వెళ్తుందనే విషయంపై ఇంకా సమాచారం అందలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఇదీ చదవండి: గాలివాన బీభత్సం..ఎయిర్పోర్ట్లో విమానాలను ఢీకొన్న సపోర్టింగ్ పరికరాలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.