విజయవాడ సెంటర్‌గా కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి వార్ మరింత ముదురుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి టార్గెట్ చేశారు. తన చిన్ననాటి స్నేహితుడు తాతినేని
రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడంపై స్పందిస్తూ మూడు రోజుల క్రితం ట్వీట్ చేసిన కేశినేని నాని.. రోజుకో ట్వీట్‌తో చిన్నిపై విరుచుకుపడుతున్నారు. దొరా చార్లెస్ శోభ రాజ్ రోజుకి కోటి అవీనీతి సొమ్ము తింటున్నావు దాంట్లో కొంచెం.. కొన్ని ఏళ్ల నుంచి 'నీ కోసం నువ్వు చెప్పిన నికృష్టపు పనులు అన్ని చేసే నీ సిబ్బంది పంచుకుంటే వాళ్ళని చేతుల మీద యాసిడ్ పోసి హింసించాలా ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుంది మై డియర్' అన్నారు. అలాగే"ఎంపీ" అంటే ( మట్టి -పేకాట ) అంటూ కొత్త అర్థం చెప్పుకొచ్చారు.విజయవాడలో ఖాకీల అరాచకం చేస్తున్నారని.. ఎఫ్ఐఆర్ కాకముందే ఇళ్లపై పడి, సాక్షి నోటీసుతో 11 గంటలు అక్రమంగా నిర్బంధించి రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 21 ను కాలరాశారని నాని ఆరోపించారు. గుండెజబ్బు, కంటి సర్జరీ అయిన తాతినేని రాంబాబుపై పటమట పోలీసులు చేసిన దౌర్జన్యంపై సీపీకి ఫిర్యాదు చేశానని.. న్యాయం జరగాలన్నారు. ఎంపీ అక్రమ దందాలను ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలపై ఏకంగా 'హత్యాప్రయత్నం' కేసులు పెట్టి జైలుకు పంపుతారా? అంటూ ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందనిపిస్తోందన్నారు.'నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న ఫ్లై యాష్ దందా కొండలను పిండేస్తున్న గ్రావెల్ మాఫియా అక్రమాలను సాక్ష్యాలతో సహా సోషల్ మీడియాలో నిలదీయడమే మైలవరం నియోజకవర్గం ,రెడ్డిగూడెం మండలానికి చెందిన ఆ ఇద్దరు నేతలు ఉయ్యూరు పెదబాబు, రమేష్ రెడ్డి చేసిన తప్పా?. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను ముందు పెట్టి, తెరవెనుక ఈ మొత్తం మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న అసలు సూత్రధారి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియూ అతని సహచరుడు మూల్పూరి కిషోర్ అని ఆధారాలతో సహా ప్రశ్నించేసరికి మీ ఈగో అంతగా దెబ్బతిందా?.. అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా?' అంటూ ప్రశ్నించారు. 'మొదట షోకాజ్ నోటీసులు ఇప్పించారు.. రాత్రికి రాత్రే పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్లి వస్తుంటే ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఆటో ఎక్కనంటే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లినంత పని చేస్తూ నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇక అన్నింటికంటే దారుణం ఏంటంటే.. కేవలం అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించినందుకు, వారిపై ఏకంగా సెక్షన్ 307 హత్యాప్రయత్నం లాంటి తప్పుడు కేసులు బనాయించి, నందిగామ సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించారు! వాళ్లేమన్నా రౌడీ షీటర్లా లేక హంతకులా? ఒక ప్రజాప్రతినిధి అండతో పోలీసులు ఇంతలా బరితెగిస్తారా?. నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం, సొంత దందాలను కాపాడుకోవడం కోసం ప్రశ్నించిన వారి గొంతు నొక్కడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్లు కాదు. మైలవరంలో సాగుతున్న ఈ గ్రావెల్, ఫ్లై యాష్ అక్రమాలపై, అలాగే ఈ అక్రమ కేసులపై తక్షణమే విచారణ జరిపించాలి' అని కేశినేని నాని డిమాండ్ చేశారు.