
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
LPG Gas Price Hike News: ఇంధన ధరల భారం సామాన్యుడిపై మరింతగా పడుతోంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, దేశీయంగా ఇంధన, గ్యాస్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 2026 జూన్ 8 నాటి తాజా ఇంధన, గ్యాస్ ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల పెంపు గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోలు): జూన్ 7 నుంచి గృహ వినియోగ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచారు. గత మూడు నెలల్లో ధర పెరగడం ఇది రెండోసారి. ఈ తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర దాదాపు రూ. 1,000 మార్కుకు చేరుకుంది.
వాణిజ్య ఎల్పీజీ (19 కిలోలు): జూన్ 1 నుంచి వాణిజ్య సిలిండర్ ధరలను కూడా పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో దీని ధర రూ.42 పెరిగి, రూ.3,113.50 కి చేరింది.
స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు జూన్ 8 (శనివారం) నాడు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ఈ ధరలను సవరిస్తుంటాయి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కంపెనీలు ఇప్పటివరకు లీటరు పెట్రోల్, డీజిల్‌పై సుమారు రూ. 7.50 మేర పెంచడం గమనార్హం.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల వ్యత్యాసాలు క్రింది విధంగా ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.69 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.82గా విక్రయిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్‌పై రూ.117.72 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.40గా ఉంది. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.115.49, డీజిల్ రూ.104.40 ఉండగా.. చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ.98.10, డీజిల్ ధర రూ.86.09 విక్రయిస్తుండగా.. లక్నో పెట్రోల్ రూ.102.05.. న్యూఢిల్లీ పెట్రోల్ రూ.102.12గా విక్రయిస్తున్నారు.
ఎగుమతి సుంకాల తగ్గింపు జూన్ 1 నుంచి ప్రారంభమైన పక్షవారానికి గాను ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లపై ఎగుమతి సుంకాన్ని తగ్గించింది. సవరించిన కొత్త ఎగుమతి సుంకాలు (లీటరుకు) పెట్రోల్ పై రూ.1.50.. డీజిల్‌పై రూ.13.50.. ఏటీఎఫ్‌పై రూ.9.50 పెంపు ఉండనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.