
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ
Jun 8 2026 7:32 AM | Updated on Jun 8 2026 7:32 AM
తమిళనాడు రాజకీయాల్లో రాజ్యసభ సీటు సరికొత్త హీటు పుట్టిస్తోంది. పార్టీ పుట్టి, అధికారంలోకి వచ్చాక తమ తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది విజయ్ నేతృత్వంలోని అధికార టీవీకే పార్టీ. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్ష డీఎంకే ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ వ్యవహారం వెనుక కృతజ్ఞత కాదని.. రాజకీయ లెక్కలు ఉన్నాయని అంటోంది. ఆ విమర్శలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
తమిళగ వెట్రి కళగం (TVK) తన తొలి రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించడంపై అధికార డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి విజయ్ ఉద్దేశపూర్వకంగానే తన పార్టీ నేతలను రాజ్యసభకు పంపకుండా కాంగ్రెస్‌కు సీటు ఇచ్చారని ఆరోపించింది. బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ పని చేశారని ఎద్దేవా చేసింది.
డీఎంకే అధికార ప్రతినిధి శ్రవణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాజ్యసభకు వెళ్తే ప్రతి జాతీయ అంశంపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా నేరుగా పోరాడాల్సి ఉంటుంది. అందుకే టీవీకే నుంచి ఎవరినీ రాజ్యసభకు పంపలేదు" అని విమర్శించారు. విజయ్ బీజేపీపై తన అసలు రాజకీయ వైఖరిని బయటపెట్టేందుకు సిద్ధంగా లేరని.. పార్లమెంట్ వేదికపై బీజేపీని నేరుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని భావించే ఆ బాధ్యతను కాంగ్రెస్‌పైకి నెట్టేశారని డీఎంకే ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా.. తన తొలి రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించడం ద్వారా రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరింత బలపరిచినట్లు టీవీకే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇరు పార్టీల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రభుత్వ ఏర్పాటు దిశగా జరిగిన మంతనాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడినే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే డీఎంకే ఈ నిర్ణయాన్ని రాజకీయ వ్యూహంగా కాకుండా.. విజయ్ రాజకీయ సంకోచంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లో తాము ముందుంటే, టీవీకే మాత్రం స్పష్టమైన వైఖరి వెల్లడించకుండా ముందుకెళ్తోందని డీఎంకే వాదిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అసలు చర్చ రాజ్యసభ సీటు గురించి కాదు.. విజయ్ నిజంగా బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కట్టుబడి ఉన్నారా? లేదంటే రాజకీయంగా తటస్థంగా ఉండాలనుకుంటున్నారా? అన్నదే డీఎంకే లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద సిద్ధాంతపరమైన చర్చకు దారి తీసింది. డీఎంకే విమర్శలకు టీవీకే ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
భార్య చేతిలో దారుణ హత్యకు గురైన ఆర్మీ ఉద్యోగి
చేప ప్రసాదం షురూ.. హైదరాబాద్ కు పోటెత్తిన జనం
నందూస్ ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్.. అసలు నిజం ఇదేనా?