
Prabhas Untold Love Story: తెలుగు చిత్ర పరిశ్రమతో మన భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఎవరంటే అందరు ముందుంగా చెప్పే పేరు ప్రభాస్ దే. అయితే ప్రభాస్ ఊసు ఎత్తగానే అందరు అనుష్కతో ఆయన
పేరును ముడిపెడుతుంటారు. కానీ ఎవరికీ తెలియని ఓ విషయం ఉంది. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలిన ఈ కథానాయిక.. ప్రభాస్ ను పిచ్చిగా ప్రేమించిందట. కానీ చివరకు ఓ బిజినెస్ మ్యాన్ ను మ్యారేజ్ చేసుకుంది. ప్రభాస్ జీవితంలో ఎవరికీ తెలియని ఆ ప్రేమ కథ విషయానికొస్తే..
Prabhas love with Star Heroine: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ఎపుడు పెళ్లి చేసుకుంటాడా అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈయన మ్యారేజ్ ఎపుడా అనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతునే ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఈయన పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు క్రియేట్ చేసారు ఆయన అభిమానులు. అవి వైరల్ అయ్యాయి కూడా.
అయితే ప్రభాస్ లవ్ గురించి మాట్లాడితే.. అనుష్కతో అతని లవ్ గురించి ముందుగా చర్చకు వస్తుంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ప్రభాస్ ను పిచ్చి పిచ్చిగా ప్రేమించిందట. విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. దాదాపు 10 యేళ్లు ప్రభాస్ గురించి వెయిట్ చేసిన ఈ భామ చివరకు గౌతమ్ కిచ్లూ అనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.
కాజల్ అగర్వాల్ విషయానికొస్తే.. ఈమె ప్రభాస్ సరసన తొలిసారి ‘డార్లింగ్’ సినిమాలో జోడిగా నటించింది. అప్పటి నుంచే కాజల్ .. ప్రభాస్ ను పిచ్చిగా ప్రేమించడం మొదలు పెట్టిందట. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో కాజల్ అగర్వాల్ తన ప్రేమ విషయాన్ని ప్రభాస్ కు ప్రపోజ్ చేసిందట. అయితే డార్లింగ్ మాత్రం కాజల్ అగర్వాల్ లవ్ ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేనట్టు చెప్పాడట.
ప్రభాస్.. కాజల్ అగర్వాల్ కు నో చెప్పినా.. ఈ చందమామ మాత్రం ప్రభాస్ ను ప్రేమిస్తూనే ఉంది. ఎపుడు కనపడ్డా ప్రభాస్ కు తన లవ్ విషయాన్ని చెబుతూనే ఉండేదట. ప్రభాస్ కూడా కాజల్ ప్రపోజల్ ను తిరస్కరిస్తూ ఉన్నాడట. చివరకు కాజల్ అగర్వాల్.. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను 35 యేళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కాజల్, గౌతమ్ దంపతులుకు ఓ కుమారుడున్నాడు.
మధ్యలో కాజల్ అగర్వాల్.. క్రికెటర్ రోహిత్ శర్మను ప్రేమించింది. ప్రభాస్ కంటే ముందు రోహిత్ శర్మను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ప్రభాస్ తో పరిచయం తర్వాత అతన్ని ఒద్దనుకుంది. పెళ్లి తర్వాత బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ తో పాటు కొన్ని మహిళ ఇతివృత్తంతో తెరకెక్కిన సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రభాస్ ఈ యేడాది.. సంక్రాంతికి ‘ది రాజా సాబ్’ సినిమాతో పలకరించాడు.