
ఇంటర్నెట్ డెస్క్: ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై హరియాణా మంత్రి అనిల్ విజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ పోరాటం చేసే హక్కు ఉందన్నారు. అయితే, బొద్దింక ఓ మురికి కీటకమని
, దాన్ని ఓ చిన్న పిల్లాడు కూడా కాలితో నలిపేయగలడని అన్నారు. అందుకే పేరు మార్చుకోవాలని ఆ పార్టీకి సూచించారు.
పరీక్షల నిర్వహణలో లోపాలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయించే బాధ్యత ప్రధాని మోదీదేనని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. స్వస్థలం శంభాజీనగర్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. పేపర్ లీకేజీలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లకు ఓసారి ఓటు వేయడం మాత్రమే రాజకీయం కాదని, ఎవరికి ఓటు వేశామో వారిని ప్రశ్నించాలన్నారు. యువత గళం విప్పినప్పుడే వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆదివారం మెట్రోలో ప్రయాణించారు.