
కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్
శ్రీకాంత్‌ను సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు.
అమరావతి,జూన్ 07: కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆ స్థానంలో అనంతపురంకు చెందిన యంగ్ ప్రొఫెషనల్ శ్రీకాంత్‌ను సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. తనను కుప్పం నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సీఎం చంద్రబాబును గత కొన్ని నెలలుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరుతున్నారు. ఈ రోజు రాజధాని అమరావతిలో కుప్పం నియోజకవర్గం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి నేతలు తీసుకెళ్లారు. అదే సమయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అంశం కూడా చర్చకు వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆయన స్థానంలో అనంతపురంకు చెందిన శ్రీకాంత్‌ను కుప్పం నియోజకవర్గం ఇన్చార్జ్గా నియమిస్తూ సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశించారు. ఆయన మార్గదర్శనంలో నడవాలంటూ కుప్పం నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
బీజేపీ పోరుబాటతో దిగొచ్చిన రేవంత్ ప్రభుత్వం: ఎమ్మెల్యే ఏలేటి
కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు