
INDIA bloc meeting | దిల్లీ: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి సోమవారం కీలక సమావేశం కానుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని డీఎంకే ఫ్రంట్
చవిచూసిన వేళ ఈ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. భవిష్యత్ వ్యూహాలు, పార్టీల మధ్య సమన్వయం సాధించడమే ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది.
దేశ రాజధాని దిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ వేదికగా సోమవారం జరిగే ఈ సమావేశానికి ఇండియా కూటమి నేతలైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్, శివసేన (యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే, వామపక్ష పార్టీ నేతలు పాల్గొననున్నారు.
23 పార్టీలు ‘ఇండియా జన్బంధన్’ సమావేశానికి హాజరుకానున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాలతో భేటీకి గైర్హాజరవుతున్నప్పటికీ.. మోదీ ప్రభుత్వ విధానాలు, చర్యలను వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, ఈ భేటీకీ డీఎంకే, ఆమ్ఆద్మీ పార్టీ దూరంగా ఉండే అవకాశం ఉందని తెలిస్తోంది. ఆప్ గత కొన్నాళ్లుగా ఇండియా కూటమి కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా.. తమిళనాడులో టీవీకే కూటమిలో కాంగ్రెస్ చేరడంపై డీఎంకే గుర్రుగా ఉంది.
అదే సమయంలో విజయ్ పార్టీ తమిళ వెట్రిగ కళగం (TVK) ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు ముందు ఇండియా కూటమి ఏర్పాటు కాగా.. అదే ఏడాది జూన్ 1న కీలక సమావేశం జరిగింది. 2025 ఆగస్టు 7న రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలకు తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎలాంటి సమావేశాలూ జరగలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు కూటమి భేటీ అవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఆదివారం మెట్రోలో ప్రయాణించారు.