
హైదరాబాద్: ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు
తెలంగాణలో ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. ‘‘రేవంత్‌రెడ్డిలా నేను పది పార్టీలు మారలేదు. నా పుట్టుక.. చావు.. రెండూ భాజపాలోనే. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎంత రెచ్చగొట్టినా తొందరపడను. అన్నింటికీ సమయమే సమాధానం చెబుతుంది. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. దళితులు, బీసీలు మీ ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మార్పులు జరగనున్నాయా?