
మాటలే పాటలైతే ఎలా ఉంటుందో అదే ‘సింగ్ గీతం’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 94 ఏళ్ల వయసులో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చెన్నైలో
ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సింగీతం మాట్లాడారు. ‘‘40 ఏళ్ల క్రితం అనుకున్న కథ ఇది. అనేక మార్పులు చేర్పులు చేసుకొని ఇన్నేళ్లకు రూపుదిద్దుకుంది. నాగ్అశ్విన్ వల్లే ఇది సాధ్యమైంది. ఆయన ఒక గ్లోబల్ డైరెక్టర్. అయినా ఎంతో ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కంటే ఆయన నన్నే అతిగా ప్రేమిస్తారు. ఒక తండ్రిలా నన్ను చూసుకుంటారు. నాపై ఆయన చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని సింగీతం తెలిపారు. ఆయన మాట్లాడుతుండగా.. నాగ్అశ్విన్ వేదికపైకి వెళ్లి నీళ్లు తాగుతారా అని అడగడం సింగీతంపై తనకున్న అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వార్త చదివారా: 45 ఏళ్ల క్రితం చెప్పిన కథ.. ఇప్పుడు ఇలా: కమల్‌హాసన్