
టీమిండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చాడు. ఐపీఎల్లో పంత్ కెప్టెన్సీ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఫేలవ ప్రదర్శన కనబర్చి, పాయింట్ల పట్టికలో చివరి
స్థానంలో నిల్వడం పంత్ అభిమానులు జీర్ణించుకోలేకపోయినా.. సర్లే అయిందేదో అయింది.. మనోడికి బాగా అచ్చొచ్చిన టెస్టు క్రికెట్లో దుమ్ము రేపుతాడే అని అంతా అనుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్‌లో అనుకున్నట్లే అదరగొట్టాడు. అయినా కూడా పంత్ ఫ్యాన్ష్ హ్యాపీగా లేరు. అందుకే కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మంచి బ్యాటింగ్ వికెట్‌పై టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కారు. ఇక పంత్ కూడా మంచి టచ్‌లో కనిపించాడు. టెస్ట్ క్రికెట్ అంటే ఎక్కడ్లేని ఊపుతో ఆడే పంత్.. అదే తరహాలో బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సెంచరీ ఖాయం అనుకుంటున్న టైమ్‌లో అవుట్ అయ్యాడు. 81 పరుగులు చేసి.. సెంచరీకి 19 పరుగుల దూరంలో వికెట్ సమర్పించుకున్నాడు. ఇదే ఇప్పుడు అభిమానులను అలకబూనేలా చేసింది. ఆ 19 రన్స్ పూర్తి చేసి.. సెంచరీ మార్క్ అందుకుంటే బాగుండేది కదా అంటూ పంత్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
A little room, a big swing, and Rishabh Pant lofts it beautifully over cover for another eye-catching boundary 👏🏏#INDvAFG | Only Test ➡️ DAY 2 | LIVE NOW 👉
— Star Sports (@StarSportsIndia) June 7, 2026
మొత్తంగా 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 81 పరుగులు చేసి షాహిదీ బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేశాడు. పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఆ సెంచరీ ఏదో పూర్తి చేసుకొని ఉంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు. పైగా పంత్ టెస్ట్ క్రికెట్లో సెంచరీ చేసి ఏడాది కాలం దాటిపోయింది. 2025లో ఇదే నెలలో పంత్ టెస్టుల్లో సెంచరీ కొట్టాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌పై భారీ స్కోర్ నమోదు చేసేలా ఉంది. మరోసారి బ్యాటింగ్‌కు దిగే అవసరం లేకుండా ఆఫ్ఘాన్‌ను పెద్ద స్కోర్‌తో ఫాలో అన్ ఆడించాలనే ప్లాన్‌లో టీమిండియా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
RISHABH PANT MISSED OUT ON A VERY WELL DESERVED HUNDRED.
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 7, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి