
దిల్లీ: రైలుపెట్టె మరుగుదొడ్డిలో వంటపాత్రల్ని కడగడంపై ఐఆర్సీటీసీకి ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ’ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటీసు జారీ చేసింది.
12223 లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) ముంబయి- ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్లో క్యాటరింగ్ సిబ్బంది నిర్వాకాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇలా టాయిలెట్లో వంటపాత్రల్ని కడగడం వల్ల ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని, ఆహార భద్రత కోణంలోనూ ఇది అత్యంత అభ్యంతరకరమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా తమకు సమాధానమివ్వాలని ఐఆర్సీటీసీకి సూచించింది. ప్రమాణాల ప్రకారం ఆహార వ్యాపార రంగంలో ఉన్నవారు పరిశుభ్రతను ప్రతి దశలోనూ పాటించాలని, పాత్రలు కడిగేటప్పుడూ అది వర్తిస్తుందని గుర్తుచేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.