
ఇంటర్నెట్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సలీమ్‌కుమార్ (56) మరణించారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కొచ్చిలోని ఓ
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు (Actor Salim Kumar Died). ఆయనకు భార్య సునీత, ఇద్దరు పిల్లలున్నారు. వీరిలో ఒకరైన నటుడు చందూ సలీమ్‌కుమార్ ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘కొత్తలోక’ లాంటి చిత్రాల్లో నటించారు. సలీమ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. సలీమ్ తనకు సోదరుడిలాంటి వారని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ పేర్కొన్నారు. ఎప్పుడూ నవ్వుతూ.. ఇతరులను నవ్వించే సలీమ్ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నారంటూ ప్రముఖ నటుడు మమ్ముట్టి పోస్టు పెట్టారు.
సినిమాల్లోకి రాకముందు సలీమ్ మిమిక్రీ చేసేవారు. 90ల్లో సినీ రంగ ప్రవేశం చేసి, 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎక్కువగా మలయాళంలో నటించిన ఆయన.. కామెడీ రోల్స్‌కు కేరాఫ్‌గా నిలిచారు. తమిళం, బెంగాలీ, హిందీ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించారు. 2010లో విడుదలైన ‘అదామింతే మాకన్ అబూ’ సినిమాలోని నటనకుగానూ జాతీయ పురస్కారం దక్కింది. ‘కంపార్ట్మెంట్’ లాంటి మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.