
వెండి ఆభరణాలకూ తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు దేశీయంగా ఉన్నాయా.. నిబంధనావళి ఎలా ఉండాలి.. అనే అంశాన్ని భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) పరిశీలిస్తోంది. 2005 నుంచే
వెండికి హాల్‌మార్కింగ్ స్వచ్ఛందంగా అమల్లో ఉండగా, 2025 సెప్టెంబరు నుంచి వీటిపై హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) సంఖ్య ముద్రిస్తున్నట్లు బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్న దుకాణాల్లోనూ వెండి ఆభరణాలు విక్రయిస్తున్న దశలో.. వీటికి హాల్‌మార్క్ అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని వివరించారు. బీఐఎస్‌లో హాల్‌మార్క్ ప్రక్రియను అయిదుగురు మాత్రమే పర్యవేక్షిస్తున్నారని, మిగిలినవారు ప్రైవేటు/అవుట్ సోర్సింగ్ వ్యక్తులని వెల్లడించారు. అందుకే వెండికి తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులు పరిశీలించి, తప్పులు జరగకుండా వ్యవహరించేందుకు నిబంధనావళి రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2024-25లో 32 లక్షల వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ వేయగా, 2025-26లో ఈ సంఖ్య 59 లక్షలకు పెరిగినట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.