వెండితెరపై గ్లామర్ నాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది తాప్సీ పన్ను . గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే నిరంతరం వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడే నేటి కాలంలో.. ఆమె ఒక
భిన్నమైన నిర్ణయంతో ఆమె వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా ప్రపంచానికి తాను కొంతకాలంగా దూరంగా ఉండటం వెనుక గల అసలు కారణాలను ఈ బాలీవుడ్ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో షేర్చే చేసుకున్నారు. ఆన్లైన్ వేదికలపై నిరంతరం యాక్టివ్‌గా ఉండాలనే ఒత్తిడి, మారుతున్న ట్రెండ్స్‌ను అందుకోవాలనే ఆరాటం తనను మానసికంగా తీవ్ర అలసటకు గురిచేశాయని ఆమె స్పష్టం చేశారు. సాధారణంగా సినీ తారలకు సోషల్ మీడియా వాడకం వృత్తిలో ఒక భాగంగా మారిపోయినప్పటికీ.. తాప్సీ మాత్రం తన మనశ్శాంతికి, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ హడావుడి జీవితం ఒక ముగింపు లేని పరుగు పందెంలా అనిపించడంతోనే, ఏడాది కాలంగా డిజిటల్ ప్రపంచానికి కాస్త విరామం ఇచ్చానని తెలిపారు. అయితే తానేదో సోషల్ మీడియాను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించలేదని, కేవలం అందులోనే మునిగితేలడం తనకు ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె 'గాంధారి' అనే ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. ఫిట్నెస్ రహస్యం.. గ్లామర్ పాత్రలపై కామెంట్స్తన ఫిట్నెస్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు తాప్సీ. చదువుకునే రోజుల్లో కాస్త బరువు ఎక్కువగా ఉండటం వల్ల, బరువు తగ్గాలనే లక్ష్యంతోనే మొదట్లో వ్యాయామాలు ప్రారంభించినట్లు చెప్పారు. కానీ కాలక్రమేణా జిమ్ వర్కౌట్స్ చేయడం అనేది కేవలం శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసమేనని గ్రహించానన్నారు. కొన్ని సినిమాల్లో స్పోర్ట్స్ పర్సన్ పాత్రల కోసం ప్రత్యేకంగా శ్రమించాల్సి వచ్చిన మాట నిజమే అయినా, రెగ్యులర్‌గా మాత్రం కేవలం హెల్తీగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. దీనికి తోడు.. బాడీ షేప్‌ను ఎక్స్పోజ్ చేయాల్సిన గ్లామరస్ పాత్రలు ప్రస్తుతం తనకు రావడం లేదు కాబట్టి, వాటి కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదంటూ కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో వయసు వివక్షసినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే ప్రధాన సమస్యలపై తాప్సీ గళం విప్పారు. ముఖ్యంగా వయసును బట్టి చూపించే వివక్షపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాతికేళ్ల వయసులో బాలీవుడ్లో అడుగుపెట్టిన తనకు, మంచి గుర్తింపు తెచ్చుకోవడానికే నాలుగైదేళ్లు పట్టిందని, తీరా గుర్తింపు వచ్చేసరికి ముప్పై ఏళ్లు దాటాయని వివరించారు. ఆ తర్వాత తీరిగ్గా.. రొమాంటిక్ కామెడీ చిత్రాలకు మీ వయసు సరిపోదు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వినోదాత్మక పాత్రలకు వయసుతో సంబంధం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వివక్ష కేవలం హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదని, దక్షిణాదిలోనూ ఇదే పరిస్థితి ఉందని, పురుష నటుల విషయంలో మాత్రం ఇలాంటి కొలమానాలు ఉండవని కుండబద్దలు కొట్టారు.టాలీవుడ్ ఇచ్చిన బలమైన పునాదిబాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తాప్సీ సినీ ప్రస్థానానికి అసలైన పునాది వేసింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమే. 2010లో లెజెండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆమె.. ఆ తర్వాత టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. మిస్టర్ పర్ఫెక్ట్, వస్తాడు నా రాజు, మొగుడు, దరువు, సాహసం వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగులో బిజీగా ఉన్న సమయంలోనే తమిళంలో 'ఆడుకాలమ్', హిందీలో 'చష్మే బద్దూర్' చిత్రాలతో ఇతర పరిశ్రమల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌పై పూర్తి శ్రద్ధ పెట్టి, అక్కడ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. నార్త్ ఇండియాలో ఎంతటి స్టార్డమ్ తెచ్చుకున్నా.. తన కెరీర్ ఎదుగుదలకు టాలీవుడ్ అందించిన సహకారమే మూలస్తంభమని తాప్సీ ఎల్లప్పుడూ గర్వంగా చెబుతుంటారు. అయితే అప్పుడప్పుడు టాలీవుడ్‌పై ఆమె చేసే కామెంట్స్ వివాదాస్పదమవువూ ఉంటాయి.