మేష రాశి నుంచి చంద్రుడు పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు ఊహించని ఆర్థిక లాభాలొచ్చే అవకాశాలున్నాయి. లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ
పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ ముఖ్యమైన కోరికలలో ఒకటి నెరవేరే అవకాశం ఉంది. సూర్య దేవుడికి నీటితో అర్ఘ్యం సమర్పించడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.
వృషభ రాశి వారికి ఈరోజు సూర్యుడి అనుగ్రహంతో మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది. బుధ, శుక్ర గ్రహాల కలయికతో మీకు అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించొచ్చు. ప్రేమ జీవితంలో, మీ జీవిత భాగస్వామితో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మీ పిల్లల ద్వారా సంతోషాన్ని పొందుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. స్నేహితుల సాయంతో మీరు అనేక పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతారు. పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. రాహువు, చంద్రుడి కలయిక వల్ల మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడొచ్చు. గురు గ్రహం ప్రభావంతో మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబ పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే ప్రయాణాల్లో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు అవసరంలో ఉన్న వ్యక్తికి ఆహారం లేదా ధాన్యం దానం చేయాలి.
సింహ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలున్నాయి. లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో మీ కోరికలు నెరవేరొచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు ఈరోజు నెరవేరొచ్చు. మీకు తండ్రి నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే, సంయమనం పాటించాలి. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు.
కన్య రాశి వారికి ఈరోజు బుధుడు, శుక్రుడి కలయిక కారణంగా ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ అంచనాలకు మించి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కళల పట్ల ఆసక్తి చూపుతారు. మీ ఇంటి అలంకరణ కోసం కొంత సమయం కేటాయిస్తారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందొచ్చు.
తులా రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు ఆస్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు మంచి లాభాలు పొందొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు చేసే ప్రయాణాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్నిశుభవార్తలు వినొచ్చు. గురు గ్రహం ప్రభావంతో వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు బంధువులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు కొన్ని సంతోషకరమైన శుభవార్తలు వింటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు.
ధనస్సు రాశి వారికి ఈరోజు లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఇది కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త పనులు చేయడానికి ఒక అవకాశంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగొచ్చు. ఆరోగ్యం లేదా ప్రయాణానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరగొచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.
మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని ఒప్పందాలు చేసుకోవచ్చు. మీరు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందొచ్చు. మీకు త్వరలో ప్రయాణం చేసే అవకాశం లభించొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ తెలివితేటలతో క్లిష్టమైన పనులను సులభంగా పూర్తి చేయొచ్చు. ఉద్యోగులు ఈరోజు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు.
కుంభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందుతారు. మీ సన్నిహితులను కలుసుకుంటారు. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ ఆదాయం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీ పెండింగులో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది.
మీన రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. పనికి సంబంధించిన చేసే ప్రయాణాలు విజయవంతం అవ్వొచ్చు. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు పొందుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పెండింగ్ పనులన్నీసకాలంలో పూర్తి చేయొచ్చు. మీ కుటుంబంతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రానికి ప్రయాణించే అవకాశం కూడా లభిస్తుంది. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి