
'ధురంధర్' చిత్రంలో అండర్‌కవర్ ఏజెంట్‌గా అద్భుత నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న నటుడు గౌరవ్ గెరా, తన సినీ ప్రస్థానంలోని తొలినాళ్లలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ఒకానొక
దశలో తన బ్యాంక్ ఖాతాలో కేవలం 84 రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌరవ్ మాట్లాడుతూ, నటుడు కావాలనే ఆకాంక్షతో ముంబైకి వచ్చిన సమయంలో తన వద్ద తగినంత డబ్బు లేదని, సినీ పరిశ్రమలో ఎటువంటి నేపథ్యం లేదని వివరించారు. "ఆటో ఛార్జీలకు కూడా డబ్బులు లేక పలుమార్లు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేవాడిని. దారిలో రోజూ ఓ హెచ్డీఎఫ్సీ బ్యాంకు బ్రాంచ్‌ను చూస్తూ.. "నన్ను జాగ్రత్తగా చూసుకో' అని ప్రార్థించేవాడిని" అంటూ తన గత స్మృతులను నెమరువేసుకున్నారు.ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్' చిత్రంలో.. పాకిస్థాన్‌లోని కరాచీలో పండ్ల రసాలు విక్రయించే మహమ్మద్ ఆలమ్ అనే పాత్రలో గౌరవ్ అద్భుతంగా నటించారు. తన కుటుంబంలో ఎవరికీ సినీ రంగంతో సంబంధం లేదని, తండ్రి ఐఐటీ-బీహెచ్‌యూలో ఇంజనీర్ కగా, సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆయన తెలిపారు. తను భిన్నమైన వృత్తిని ఎంచుకున్నప్పటికీ, కుటుంబ సభ్యులు ఎంతో తోడ్పాటునందించారని పేర్కొన్నారు.కష్టకాలంలో తన తండ్రి పంపిన 2,000 రూపాయలతో పాటు ఆయన రాసిన లేఖలను ఇప్పటికీ ఎంతో భద్రంగా దాచుకున్నట్లు గౌరవ్ భావోద్వేగంగా చెప్పారు. అప్పట్లో ఆ పరిస్థితులను తాను ఇబ్బందులుగా భావించలేదని, భవిష్యత్తుపై ఉన్న అచంచలమైన నమ్మకమే తనను ముందుకు నడిపించిందని అన్నారు. 'ధురంధర్' విజయంతో లభిస్తున్న గుర్తింపు పట్ల