
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Revanth reddy announces 5000 jobs in Telangana police department released soon: సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిరుద్యోగులకు వరుసు నోటిఫికేషన్లపై శుభవార్తు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవం రోజు మూడు నోటిఫికేషన్ లను టీఎస్ పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా.. తాజాగా.. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డీవైఈవో), గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న ది హిందూ హడిల్ 2026 లైవ్ సెషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ తెలంగానలో రాబోయే కొన్ని రోజుల్లో తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. ఏకంగా 5 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీనిపైన పోలీసు రిక్రూట్ మెంట్ తో ఖాళీలు, మొదలైన వివరాలు తెప్పించుకుని త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
అంతే కాకుండా భారతదేశంలోనే ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో భారీగా ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తమ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటూ నోటిఫికేషన్ లను రిలీజ్ చేయడమే కాకుండా ఎలాంటి అవరోధాలు, లీకులు,కోర్టు కేసులు లేకుండా ఎగ్జామ్ లను పకట్బందీగా నిర్వహించి నియామక పత్రాలను అందజేస్తున్నట్లు చెప్పారు. గడిచిన 15 నెలల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో 67,760 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీపై తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని యూపీఎస్సీ (UPSC) అనుసరించే అత్యుత్తమ విధానాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లో విజయవంతంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 5 వేల యూనిఫామ్ జాబ్ లను త్వరంలో ప్రకటిస్తామని చెప్పడంతో నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి వంటి కీలక పదవుల్లో ఉత్తరాది వారే ఉన్నానని అన్నారు. సౌత్ రాష్ట్రాలుగా పన్నులు కడుతూ ఢిల్లీకి సెల్యూట్ కొడుతూ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండదల్చుకొలేన్నారు.
Read more: Hyderabad: సీఎం రేవంత్‌ను బలిస్తానని అనుచిత వ్యాఖ్యలు.. జనసేన కార్యకర్తను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..
అంతేకాకుండా కేంద్రంకు చిత్త శుద్ది ఉంటే మహిళ బిల్లుపై వెంటనే అమలు చేసేలా ముందుకు వెళ్లాలన్నారు. తమ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుందన్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా ఈగల్ టీమ్ ను రంగంలోకి దింపామన్నారు. ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. హైడ్రా వ్యవస్థతో చెరువుల్ని, జలవనరుల్ని కబ్జాల బారి నుంచి కాపాడుతున్నామన్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.