
ఇంటర్నెట్‌డెస్క్: వరుస చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్. ఇప్పుడు మరో సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. భరణ్
దండమూడి, శరణ్య శర్మ, రవి మహాదాస్యం, రాజేశ్ ఖన్నా, జీవన్ కుమార్, భోగిరెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘జయముంది భయమేల మనసా’. రంజిత్ పాశం దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈటీవీ విన్ వేదికగా జూన్ 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీవితం నిస్తేజంగా మారిన ముగ్గురు యువకులు 800 కి.మీ. సైకిల్‌పై రోడ్ ట్రిప్ చేయాలనుకుంటారు. మరి వారు తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని ఎలా మార్చింది? ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.