
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
OG Movie Brain Surgery News: వైద్యరంగంలో సాంకేతికత, అద్భుతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోగికి స్పృహ తప్పించకుండా, వారు ఇష్టపడే విషయాల్లో ముంచెత్తుతూ శస్త్రచికిత్సలు చేయడం ఇటీవల ఎక్కువైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన మెడికల్ వండర్ చోటుచేసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' (OG) సినిమా చూపిస్తూ ఒక మహిళకు వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు.
అసలేం ఏం జరిగిందంటే? ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఒక్కసారిగా మూర్ఛ (ఫిట్స్) వచ్చి కింద పడిపోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు MRI (ఎంఆర్ఐ) స్కాన్ టెస్ట్ చేసి చూడగా.. మెదడులో ఒక గడ్డ (బ్రెయిన్ టూమర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఈ సర్జరీ అత్యంత సున్నితమైనది కావడంతో ఆమెకు పూర్తిగా స్పృహ తప్పించకుండా.. మెలకువగా ఉన్నప్పుడే ఆ గడ్డను తొలగించాలని డాక్టర్ల బృందం నిర్ణయించింది.
'ఓజీ' చూపిస్తూ చూపిస్తూ సర్జరీ.. రోగికి సర్జరీ సమయంలో ఎలాంటి భయం లేకుండా, ప్రశాంతంగా ఉంచేందుకు ఆమె ఇష్ట దైవం లేదా అభిమాన నటుడి గురించి వైద్యులు అడిగి తెలుసుకున్నారు. కోటేశ్వరమ్మకు పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం అని తెలియడంతో.. వైద్యులు ఒక వినూత్న ప్రయోగం చేశారు.
ఆపరేషన్ థియేటర్లోనే ఆమెకు ఎదురుగా స్క్రీన్ ఏర్పాటు చేసి, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'OG' సినిమా (గ్లింప్స్/పాటలు/వీడియోలు) ప్లే చేశారు. కోటేశ్వరమ్మ ఆ సినిమాను ఆసక్తిగా చూస్తూ, మెలకువగా ఉన్న సమయంలోనే వైద్యులు చాలా చాకచక్యంగా శస్త్రచికిత్సను ప్రారంభించారు.
సినిమా చూస్తూ ఆమె పరధ్యానంలో ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మెదడులోని గడ్డను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ కోలుకుంటున్నట్లు సమాచారం. రోగి అభిమానాన్ని సైతం వైద్య చికిత్సకు అనుకూలంగా మార్చుకుని అరుదైన సర్జరీని సక్సెస్ చేసిన డాక్టర్ల బృందాన్ని స్థానికులు, పవన్ కల్యాణ్ అభిమానులు అభినందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.