
India T20 Squad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఈ ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు (Asian Games 2026) కోసం కూడా భారత పురుషుల టీ20 జట్టును
అధికారికంగా ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ యువ ప్రతిభకు, సీనియర్ల అనుభవానికి పెద్దపీట వేస్తూ ఈ బలమైన స్క్వాడ్‌ను సిద్ధం చేసింది.
Read also:Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ అజిత్ అగార్కర్ ప్రశంసలు
స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ పర్యటనలకు మరియు ఆసియా క్రీడలకు భారత జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపించనున్నాడు. కాగా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ కుర్రాడు, తెలుగు తేజం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం విశేషం. విదేశీ గడ్డతో పాటు ఆసియా సమరంలోనూ తిలక్ వర్మ లీడర్షిప్ రోల్లో కనిపించనుండటంతో తెలుగు క్రికెట్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఈ జట్టు ఎంపికలో అత్యంత సంచలనాత్మకమైన విషయం ఏమిటంటే.. 15 ఏళ్ల యువ సంచలనం, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కడం. ఇటీవల ఐపీఎల్లో పరుగుల వరద పారించిన వైభవ్‌కు ఇది చాలా పెద్ద బ్రేక్. తద్వారా భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన (Youngest Player) ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాడు. అతనితో పాటు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ప్రిన్స్ యాదవ్ కూడా తొలిసారి ఎంపికయ్యాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికైన జట్టునే ఆసియా క్రీడలకూ కొనసాగించనున్నారు. అయితే, చైనా/జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్ టోర్నమెంట్ నియమ నిబంధనలు మరియు వ్యూహాత్మక మార్పుల్లో భాగంగా.. అక్కడ యువ ఆల్‌రౌండర్ ప్రిన్స్ యాదవ్‌కు బదులుగా స్టార్ స్పీడ్‌స్టర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రానున్నాడు. బుమ్రా రాకతో ఆసియా గేమ్స్‌లో భారత బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది.
Famous actor Anthony Head: బ్రిటిష్ వినోద రంగంలో తీవ్ర విషాదం: ప్రముఖ నటుడు ఆంథోనీ హెడ్ కన్నుమూత
Sattendrudu Marudu Vanilai Movie: జై ‘సత్తెంద్రుడు మారుదు వానిలై’ మూవీ రివ్యూ!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
IND vs AFG: ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ.. ఆ మరుసటి బంతికే అవుటైన రాహుల్
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ అజిత్ అగార్కర్ ప్రశంసలు
IND vs ENG:ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్స్.. బీసీసీఐ అనౌన్స్మెంట్లో ఆ ముగ్గురు పేర్లు చూసి మైండ్ బ్లాక్!
IND vs AFG Test Match:కేఎల్ రాహుల్‌కు భారీ అదృష్టం.. అల్ట్రాఎడ్జ్‌లో స్పష్టంగా అవుట్ వచ్చినా బతికిపోయిన భారత ఓపెనర్!
IND vs AFG Test Score:లంచ్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?
Gautam Gambhir: ఐసీసీ సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్లో పింక్ బాల్ రూల్‌కు హెడ్ కోచ్ గంభీర్ జై!