
Harish Rao Siddipet: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సిద్దిపేట నియోజకవర్గం నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్) గుండెపోటుతో మృతి చెందారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
ఆరోపించారు. మరణించిన కనకయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, ఈ మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కనకయ్య పండించిన పంటను దాదాపు 45 రోజుల పాటు కొనకుండా ఆలస్యం చేయడంతో, ఇటీవల కురిసిన వర్షానికి వడ్లన్నీ తడిసిపోయాయని, ఈ ఆవేదనతోనే ఆయన మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also :Harish Rao counters Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డివి “మతిలేని మాటలు”.. హరీశ్ రావు
తడిసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్లి కొనుగోలు చేయాలని ప్రాధేయపడితే, నాలుగు ట్రాక్టర్ల వడ్లకు గాను ఏకంగా 40 సంచుల వడ్లను మిల్లర్లు కట్ చేశారని హరీష్ రావు తెలిపారు. తన 40 సంచుల వడ్లు కట్ చేశారని నిన్న రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో కనకయ్య తీవ్ర కలత చెందుతూ బాధపడ్డారని, ఆ టెన్షన్ లోనే నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చిందని వివరించారు. అందువల్ల ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని ఆయన అభివర్ణించారు. మరణించిన కనకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు.
హైదరాబాద్‌లో కూర్చొని 80 నుండి 90 శాతం వడ్లు కొన్నామని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ఇంకా 30 నుండి 40 శాతం వడ్లు పెండింగ్‌లోనే ఉన్నాయని హరీష్ రావు విమర్శించారు. ప్రస్తుతం వాతావరణం దారుణంగా మారి వర్షాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులు రెండు నెలలుగా వడ్లు అమ్ముకోలేక కల్లాల వద్ద, మిల్లులు, గోదాముల ముందు లారీలపై రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని, ప్రతి క్వింటాల్‌కు 4 నుండి 5 కిలోల కోత పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పంట పండించడం సులభంగా ఉంది కానీ, ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు కళ్ళలో రక్తం వచ్చే నరకప్రాయమైన పరిస్థితి కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. కుకునూరుపల్లి దగ్గర ఒక రాజస్థాన్ లారీలో వడ్లు ఎక్కించే ప్రయత్నం చేస్తే, ఆ లారీ వడ్లతో సహా రాజస్థాన్ వెళ్ళిపోయిందని గుర్తుచేశారు. అలాగే దుబ్బాక నియోజకవర్గం చేర్వాపూర్, ఎన్సాన్ పల్లి గ్రామాల్లో సంచులు ఎత్తకపోవడం వల్ల వడ్లు మొత్తం చెదలు పట్టిపోతున్న దుస్థితి నెలకొందన్నారు. చివరికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారి స్వంత నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం, వెంకటాపూర్ గ్రామంలో నేటికీ ఒక్క క్వింటాల్ వడ్లు కూడా కొనలేదని, ఎక్కడి వడ్లు అక్కడే ఉండిపోయాయని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి సమస్యలను వదిలేసి.. “నేను మళ్ళీ గెలుస్తా, తొక్కుతా, పండబెడతా” అంటూ తొండల భాష, తొత్తిరి భాష మాట్లాడుతున్నారు తప్ప రైతులకు ఏం చేశారో సమాధానం చెప్పడం లేదని హరీష్ రావు దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటో ఒక్కటైనా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎరువుల సరఫరాలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతుబంధు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. గత 4 నెలల నుండి రాష్ట్రంలో చనిపోయిన రైతులకు రైతుబీమా కూడా అందడం లేదని, దానిని రద్దు చేశారని మండిపడ్డారు.
ప్రస్తుత వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికారులు, మంత్రులు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వృథా మాటలు కట్టిపెట్టి యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగాలన్నారు. ఎలాంటి తరుగు లేదా కోతలు లేకుండా రైతులు పండించిన వడ్లను తక్షణమే కొనుగోలు చేసి రైతుల గోసను తీర్చాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.
Teradata Company: టెరాడేటా సంచలన నిర్ణయం: 5,100 మంది ఉద్యోగులకు నో ఇన్క్రిమెంట్
Kowdipally CHC Opening: త్వరలో కౌడిపల్లిలో నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు.
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Siddipet news: సిద్దిపేటలో అద్వితీయ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించిన హరీశ్ రావు
Siddipet News:పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ హామీ!
World Environment Day 2026: పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్
Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్
Nangunoor Paddy Procurement:మిల్లర్ల అక్రమాలపై నంగునూర్ మార్కెట్ చైర్మన్ ఫైర్!
BRS protest : పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై బీఆర్ఎస్ నిరసన ధర్నా