
వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న రణబాలి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో
Jun 6 2026 12:37 PM | Updated on Jun 6 2026 12:45 PM
వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న రణబాలి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ సినిమా రూపొందుతోంది.
తాజాగా ‘రణబాలి’ సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే గండికోటలో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ రూపొందించారు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన 90 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
ఔట్ పుట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పంజగుట్టలో అందాల నటి రాశీసింగ్ సందడి (ఫొటోలు)
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
సహారా ఎడారిలో తీవ్ర విషాదం.. నీళ్లు దొరక్క 49 మంది మృతి..
కావ్య మారన్ కు అతనంటే ఇష్టం.. అందుకే నన్ను ఆడించలేదు.. బాంబు పేల్చిన లివింగ్ స్టోన్
నందు భర్త ఆడవాళ్లకు నరకం చూపించాడు! చచ్చిపోతామన్నా పట్టించుకోలేదు