
మహారాష్ట్ర పుణె సమీపంలోని పింప్రి-చించ్వాడ్ పరిధిలో ఒక విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. స్థానిక జాతరలో ఒక మహిళ కొనుగోలు చేసిన బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' (Made in Pakistan) అనే లేబుల్ ఉండటం
స్థానికంగా కలకలం రేపింది. కొనుగోలు చేసిన సమయంలో సాధారణంగానే ఉన్న ఆ బెడ్‌షీట్‌ను, ఇంటికి తీసుకెళ్లి ఉతికిన తర్వాత ఓ మూలలో దాగి ఉన్న పాకిస్థాన్ ట్యాగ్ బయటపడింది. దీనిపై సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు.చించ్వాడ్ ప్రాంతంలోని ప్రసిద్ధ శ్రీ మోరయా గోసావి ఆలయ వాతావరణంలో బుధవారం జరిగిన సంకష్ట చతుర్థి జాతరలో ఆ మహిళ ఈ బెడ్‌షీట్‌ను కొనుగోలు చేసింది. కొనేటప్పుడు ఎలాంటి అనుమానాస్పద గుర్తులు లేవు. అయితే, ఇంటికి వెళ్లాక దానిని వాష్ చేయడంతో ఒక మూలన దాచిన లేబుల్ స్పష్టంగా కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళనతో ఆ మహిళ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, దిగుమతి నిబంధనల ఉల్లంఘనలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.పోలీసుల ప్రత్యేక నిఘాఈ వైరల్ వీడియోపై తక్షణమే స్పందించిన పింప్రి-చించ్వాడ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బెడ్‌షీట్‌ను అమ్మిన సదరు వీధి వ్యాపారి (Vendor) ఎవరు? అతడికి ఈ స్టాక్ ఎక్కడి నుంచి సరఫరా అయింది? స్థానిక మార్కెట్లోకి ఈ పాకిస్థాన్ వస్తువులు ఎలా ప్రవేశించాయి? అనే సప్లై చైన్ నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు