గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు, సోషల్ మీడియా వేదికగానూ తనదైన టైమింగ్‌తో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నెట్టింట చేసిన హంగామా నందమూరి అభిమానులనే కాకుండా, సాధారణ నెటిజన్లను
సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా స్టార్ హీరోలు సోషల్‌మీడియాలో వ్యక్తిగత విషయాలపై స్పందించడం చాలా అరుదు. కానీ, తారక్ మాత్రం తన ఫ్యాన్స్‌తో ఒక సామాన్యుడిలా ముచ్చటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.కుకీస్ ముచ్చట.. క్రేజీ రిప్లై!తాజాగా ఎన్టీఆర్ స్వయంగా తన ఇంట్లో కుకీస్ బేక్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. హీరో చేతి వంటను చూసిన సాయితేజ అనే ఓ అభిమాని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. "అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మా కోసం రెండు కుకీలు పంపించవా?" అంటూ సరదాగా అడిగారు. దీనికి ఎన్టీఆర్ స్పందించిన తీరు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పాపులర్ మీమ్ ఆడియో అయిన "అడ్రస్ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్ పెట్టు" అనే వీడియోను రిప్లైగా ఇస్తూ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. కేవలం రిప్లై ఇవ్వడంతోనే సరిపెట్టకుండా సదరు అభిమానికి నిజంగానే కుకీస్ పంపించి రియల్ సర్ప్రైజ్ ఇచ్చారు యంగ్ టైగర్. మారాయి.. అన్నీ మారాయి!తారక్ ట్వీట్ల పరంపర అక్కడితో ఆగలేదు. బిర్యానీ ప్రియుడిగా పేరున్న ఎన్టీఆర్ ఇలా కుకీస్ చేయడాన్ని చూసి మరో అభిమాని ఆశ్చర్యపోయాడు. "అన్నా.. బిర్యానీ, నాటుకోడి వండే నువ్వేంటి.. ఇలా కుకీస్ చేయడం ఏంటి?" అని ప్రశ్నించగా.. దానికి కూడా తారక్ తన మార్క్ హాస్య చతురతను ప్రదర్శించారు. 'బాద్షా' సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఫేమస్ డైలాగ్ "మారాయి.. అన్నీ మారాయి" అనే వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఎన్టీఆర్ టైమింగ్‌కు, ఆయనలోని హ్యుమర్ సెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. "మా అన్న మామూలోడు కాదు" అంటూ ఈ ట్వీట్లను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. 'డ్రాగన్' అప్డేట్ఒకవైపు సోషల్ మీడియాలో ఇలా సందడి చేస్తూనే, మరోవైపు వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ (టీజర్) ఇప్పటికే సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. అటు వెండితెరపై పవర్ఫుల్ యాక్షన్‌తో, ఇటు సోషల్ మీడియాలో ఇలాంటి లవ్లీ గెస్చర్స్‌తో తారక్ అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు.