మేష రాశి వారికి ఈరోజు కుజుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులకు అధికారుల నుంచి ప్రశంసలు లభించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. భూమి
, ఆస్తికి సంబంధించిన విషయాలలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనులు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభించనుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పనికి సంబంధించి ఈరోజు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకోవచ్చు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.
కర్కాటక రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు సన్నిహిత బంధువులను కలిసే అవకాశం ఉంది. చంద్రుడు రాహువు కలయిక కారణంగా మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది.
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. చంద్రుడు, రాహువు కారణంగా ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితులే శత్రువుల్లాగా ప్రవర్తించొచ్చు. మీ పనులు నెమ్మదిగా సాగొచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. రాజకీయ రంగాల్లో ఉండే వ్యక్తులకు విజయం లభించొచ్చు. మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది.
కన్య రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టకరంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. శని దేవుని అనుగ్రహంతో మీకు శుభ పలితాలు రానున్నాయి. ఈ సమయంలో పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసే అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి పెరుగుతుంది. మీకు ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొంటారు. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది.
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరగొచ్చు. మరోవైపు మీ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతిని పొందొచ్చు. శని స్తోత్రం పఠించడం వల్ల శని దోషం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. మీ కష్టానికి తగిన మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. శని స్తోత్రం పఠించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది.
మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు నిష్క్రమించడంతో మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు మతపరమైన, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు మీ పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య సహకారం పెరుగుతుంది. మీకు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది.
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. చంద్రుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో మీ ఖర్చులు పెరగొచ్చు. చంద్రుడు, రాహువు కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు స్నేహితులు, సన్నిహితుల నుంచి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మరోవైపు మ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. విద్యుత్ పరికరాలు లేదా ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన పనులలో మంచి విజయం లభించొచ్చు.
మీన రాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు కానుంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి పురోగతి లభించొచ్చు. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి