
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 వేలంలో తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అతడు జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాల్సి ఉన్నందున ఈ టోర్నీకి
అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. మహారాజా ట్రోఫీ ఐదో ఎడిషన్ జూన్ 20న ప్రారంభమై జులై 12న ముగియనుంది. మ్యాచ్‌లు మైసూరు, హుబ్బళ్లి, బెంగళూరు వేదికగా జరగనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.