
ఇంటర్నెట్డెస్క్: హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గత కొన్ని
ఇంటర్నెట్డెస్క్: హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ శివారు గండిపేటలో 9 ఎకరాల 28 గుంటల సర్కారు భూమిని కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు తెర వెనుక మంత్రాంగం నడిపించినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వేనంబరు 18లోని ప్రభుత్వ భూమికి సంబంధించి నకిలీ జీవోల తయారీ, ఆ ప్రతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వెనుక ఈయన పాత్ర ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. వీటికితోడు బ్రహ్మనాయుడి ఖాతా నుంచి రూ.1.25 కోట్ల నగదు బదిలీ అవడం దీనికి మరింత బలం చేకూర్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో బ్రహ్మనాయుడు సహా మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఏపీలోని నరసరావుపేటలో బ్రహ్మనాయుడు నివాసంలో సోదాలకు వెళ్లగా అక్కడా ఆయన అందుబాటులో లేరు. ఇతర నిందితులు బొల్లా రమేశ్, కొవ్వూరు సునీల్, మరో ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. తొలుత హైదరాబాద్, ఆ తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు నిందితులు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం కాంచీపురంలో బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు.