
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Kalvakuntla Kavitha visits ameerpet maitrivanam fire accident victims: హైదరాబాద్ లో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు టెన్షన్ పెట్టిస్తున్నాయి. గత నెలరోజుల వ్యవధిలో పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల అమీర్ పేట్ లోని మైత్రీ వనంలో కేఎస్ఆర్ షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. నగరం నడిబొడ్డున అది కూడా ట్రాఫిక్ భారీగా ఉండే మధ్యాహ్నం వేళ ఈ ఘటనచోటు చేసుకుంది. దట్టంగా మంటలు ఎగిసి పడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతంలో నల్లని పొగలు వ్యాపించాయి.
ప్రజలు అంతా పరుగులు పెట్టారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనలో 4 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులుచెబుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ లోని మైత్రీ వనం బాధితుల్ని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారు ఏమి నష్టపోయారో తెలుసుకున్నారు. ఘటన తర్వాత సిట్యువేషన్, ప్రభుత్వం నుంచి ఏదైన భరోసా వచ్చిందా అని అడిగి తెలుసుకున్నారు.
ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. అమీర్ పేట్ అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలన్నారు. బాధితులకు పరిహరం ప్రకటించాలని అన్నారు. మరోవైపు నగరం నడిబొడ్డున అగ్ని ప్రమాదం జరిగితే గంటన్నర వరకు ఫైరింజన్ లు రాకపోవడం ఏంటని అన్నారు.
Read more: Hyderabad: అత్తాపూర్‌లో దారుణం... కట్టుకున్న భార్యను కత్తి, ఇనుప రాడ్ లతో కొట్టి చంపిన భర్త.. ఏంజరిగిందంటే..?
హోంశాఖ కూడా సీఎం రేవంత్ దగ్గరే ఉన్నందున ఇటీవల తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాద ఘటనపై రివ్యూను నిర్వహంచాలన్నారు. అంతే కాకుండా.. అమీర్ పేట్ ఏ ఫైర్ పీఎస్ పరిధిలోకి వస్తుందో తెలియక ఫైరింజన్ లు రావడానికి ఆలస్యమైందన్నారు. హైడ్రా అధికారులు సైతం నగరంలోని అన్ని బిల్డింగ్ లను తనిఖీలు చేయాలన్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉండాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.