
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
YSRCP Ex Mla bolla brahmanaidu arrested in tamil nadu over gandipet land scam: వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గండిపేట్ లోని భూముల్ని అక్రమ జీవోలు, ఫోర్జరీ సంతాకాలతో కబ్జాకు యత్నించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారులు బ్రహ్మనాయుడితో పాటు 9 మందిపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి బొల్లా బ్రహ్మనాయుడు పరారిలో ఉన్నాడు. సైబరాబాద్ పోలీసులు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు తమిళనాడులోని కాంచీపురంలో ఉన్నట్లు గుర్తించారు.
పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు కాంచీపురం చేరుకుని ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గండిపేట్ లో 9 ఎకరాల 28 గుంటలు కొట్టేసేందుకు ప్రయత్నిచినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీని కోసం చాలా మంది రంగంలోకి దిగి రెవెన్యూ రికార్డ్స్ ను ఫోర్జరీ చేసి స్థలాన్ని కబ్జా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా గండిపేట, నార్సింగి ప్రాంతాల్లో కబ్జాలకు యత్నించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ భారీ భూ కుంభకోణం విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన కీలక సమాచారంతోనే కొంత కాలంగా పరారీలోఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేను గుర్తించినట్లు సమాచారం.
Read more: Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి అభ్యర్థి ఇతనే! డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం!
ప్రభుత్వ అధికారుల ఫోర్జరీ సంతకాలతో కూడిన ఫేక్ జీవోలతో, భూముల్ని కబ్జాకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ క్రమంలో వైసీపీ నేత ఈ విధంగా కబ్జా ఆరోపణల్లో అరెస్ట్ కావడం మాజీ సీఎం వైఎస్ జగన్ కు, పార్టీకి చెడ్డపేరు తీసుకొని వస్తుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.