
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగరంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలు
‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగరంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఎలాగైనా సరే సాలిడ్ హిట్‌తో సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాలనే పట్టుదలతో ఈ యంగ్ హీరో కథల ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత మూడేళ్లలో వైష్ణవ్ ఏకంగా 100కు పైగా స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది.
ఎట్టకేలకు ఈ మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వైష్ణవ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఆల్మోస్ట్ ఒకే చేసారు. యువ దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన ఒక అద్భుతమైన లైన్ వైష్ణవ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ వింటున్నంత సేపూ దర్శకుడి నరేషన్ శైలి ఈ యంగ్ హీరోను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో బ్యాంక్రోల్ చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వాత 100 కథలు విని వైష్ణవ్ తేజ్ ఓకే చేసిన ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.