
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు వృషభ రాశి లగ్న స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల వృషభ రాశి వారు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కెరీర్లో మంచి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు వృషభ రాశి లగ్న స్థానంలో సంచరిస్తాడు. దీనివల్ల వృషభ రాశి వారు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈ పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాలు ఊహించని విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలతో మంచి స్థానం సంపాదిస్తారు.
కర్కాటక రాశి వారికి అంగారకుడు 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ప్రభావం ఈ రాశివారి సోషల్ సర్కిల్‌ను బాగా పెంచుతుంది. మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం దక్కుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారులకు కొత్త, మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపెన్నడు లేని విధంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
అంగారకుడు సింహ రాశి పదవ ఇంట్లో సంచరిస్తాడు. దానివల్ల ఈ రాశి వారి కెరీర్ కీలక మలుపు తిరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుజుడి సంచారం ఈ రాశివారి ఉద్యోగ, వ్యాపార జీవితంపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో, మీరు మరిన్ని సౌకర్యాలు, విలాసాలు పొందుతారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు.
కుజుడు, మీన రాశి మూడవ ఇంట్లో సంచరిస్తాడు. ఇది మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీరు జీవితంలో పురోగతి, విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయం ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసానికి కీలకం. అంగారకుడి శక్తి మీ కెరీర్లో కొత్త శిఖరాలకు చేరడానికి సహాయపడుతుంది. ఇంటా బయటా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారు. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.