
చాప్టర్- 1.. ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక స్థితి ప్రస్తుత ప్రపంచం ఒకానొక మార్పునకు లోనవుతోంది. 21వ శతాబ్దపు మధ్యకాలంలో.. ఏయే దేశాలు ప్రపంచ ఆర్ధిక స్థితిగతులను నిర్దారిస్తాయో గుర్తించడమే
చాప్టర్- 1.. ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక స్థితి
ప్రస్తుత ప్రపంచం ఒకానొక మార్పునకు లోనవుతోంది. 21వ శతాబ్దపు మధ్యకాలంలో.. ఏయే దేశాలు ప్రపంచ ఆర్ధిక స్థితిగతులను నిర్దారిస్తాయో గుర్తించడమే టార్గెట్ గా గోల్డ్ మన్ సాక్స్ ఒక కంప్లీట్ ఎసెస్మెంట్ రిపోర్ట్ ని జనరేట్ చేసింది. ఈ అంచనాలు కేవలం థియరీ మాత్రమే కాదు ఒక ప్రాక్టికల్ క్లియర్ పిక్చర్. ఇప్పటికే పక్కా ప్రణాళికతో ఆర్ధికాభివృద్ధిని అంచలంచలుగా పెంచుకుంటూ వెళ్తోన్న కొన్ని దేశాలు.. ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటాయో లెక్కించేందుకు ఈ రిపోర్ట్ పర్ఫెక్ట్ గా పని చేస్తుంది. ఇప్పటి వరకూ ఉన్న వరల్డ్ ఎకనామికల్ రియల్ పిక్చర్- రీజనరేట్ అవుతోంది. కేవలం అభివృద్ధి చెందిన ఆర్ధిక శక్తులే కాదు.. అభివృద్ధి చెందుతోన్న ఆర్ధిక శక్తులు ఎలా ఊపందుకుంటాయో ఈ నివేదిక స్పష్టంగా తేల్చి చెప్పింది. దీన్నిబట్టీ చూస్తే 2050- 2075 మధ్య నాటికి ప్రపంచ ఆర్ధిక శక్తుల క్రమం ఎలాంటిదో వాటి స్వరూప స్వభావాలు ఎలాంటివో ఒక రూట్ మ్యాప్ లా పని చేస్తుందీ రిపోర్ట్.
చాప్టర్- 2.. 2050 నాటి సరికొత్త ఆర్ధిక శక్తులు
గోల్డ్ మన్ సాక్స్ ప్రకారం.. 2050 నాటికి ప్రపంచంలో ఐదు అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థలు ఏవని చూస్తే.. వాటిలో మొదటి స్థానంలో చైనా, ఆ తర్వాత యూఎస్, భారత్ టాప్ త్రీలో నిలవగా.. ఇండోనేషియా- నాలుగు, జర్మనీ- ఐదో స్థానంలో ఉంటాయంటోందీ నివేదిక. ఇప్పటి వరకూ టాప్ గేర్ లో నడిచిన ఫైనాన్షియల్ కంట్రీస్ లోకి.. అనూహ్యంగా ఇండోనేషియా దూసుకురావడమే ఇక్కడ అతి పెద్ద వింత.
బ్రెజిల్, రష్యా వంటి దేశాలను క్రాస్ చేసి ఇండోనేషియా ఇలా నాలుగో స్థానానికి ఎగబాకడం.. కీలకమైన మార్పుగా కనిపిస్తోంది. అభివృద్ధి చెందుతున్న వర్గాల్లోకి ఇండోనేషియా రావడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ ఇప్పటి వరకూ ఆసియా ఆర్ధికాభివృద్ధి అనేది కేవలం ఒక ఊహాగానంగా మాత్రమే ఉండేది. కానీ, 2050 నాటికది నిజమయ్యేలా కనిపిస్తోందని అంటుంది గోల్డ్ మన్ సాక్స్ నివేదిక. దీనంతటికీ ప్రధాన కారణం.. ఈ దేశాలకున్న ప్రాధమిక సామర్ధ్యం, విస్తృత మార్కెట్ గా తెలుస్తోంది.
చాప్టర్- 3.. అమెరికాను క్రాస్ చేయనున్న చైనా
గోల్డ్ మన్ సాక్స్ నివేదికలోని మరో ముఖ్యమైన విషయం.. 2035 నాటికి చైనా యూఎస్ ని క్రాస్ చేయడం. ఈ మార్పు గానీ వాస్తవరూపంలోకి మారితే.. అది ప్రపంచ ఆర్ధిక చిత్రంలో మరో ముఖ్యమైన మార్పుగా చెప్పాల్సి ఉంటుంది. ఇది కొన్ని దశాబ్దాలుగా చైనా సాధించిన వేగవంతమైన నిర్మాణాత్మక మార్పునకు సంకేతంగా చెప్పాలి.
చైనా ఆర్ధిక వ్యవస్థలో ఇటీవల మందగించిన స్థితిగతులు, సవాళ్లు ఉన్నప్పటికీ దాని లాంగ్ రన్ లో ఇప్పటికీ ఎంతో పటిష్టంగానే ఉంది డ్రాగన్ కంట్రీ.. అప్పుడప్పుడూ ఎదురయ్యే చిన్నా చితకా సమస్యలను అధిగమిస్తూనే చైనా తన పారిశ్రామిక పరిధి, విలువ మరింత విస్తరిస్తూనే పోతోంది. దీంతో ఈ ఏషియన్ కంట్రీ తన స్థానం మరింత పదిల పరుచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక శక్తిగా అవతరించేలా తెలుస్తోంది. తయారీ రంగంలో తనకున్న పట్టు, ఆపై సాంకేతిక పరిజ్ఞానం తో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఒక సమాధానం కనుగుంటూ దూసుకెళ్లేలా తెలుస్తోంది చైనా.
2075 నాటికి ప్రపంచంలోనే మూడు అతి పెద్ద ఆర్ధిక శక్తులుగా చైనా, భారత్, యూఎస్ నిలిచేలా తెలుస్తోంది. ఇక్కడ గోల్డ్ మన్ సాక్స్ మరో ముఖ్యమైన అంచనా వేసింది. అదేంటంటే భారత్- యూఎస్ ని క్రాస్ చేయడం. దీంతో భారత్- చైనా తర్వాత అంత పెద్ద ఆర్ధిక శక్తిగానూ వరల్డ్ వైడ్ గా సెకండ్ ర్యాంక్ లోనూ నిలవడం ఖాయంగా తెలుస్తోంది.
దీన్నిబట్టీ చూస్తే.. వచ్చే రోజుల్లో ప్రపంచ అతి పెద్ద ఆర్ధిక శక్తుల్లో రెండు- ఏషియాలోనే ఉంటాయి. ఇది 21వ శతాబ్దపు మధ్య కాలం నాటి స్థితిగతులకు అద్దం పడుతోంది. భారతదేశ జనాభా- దాని స్వరూప స్వభావాలు.. ఆపై భారీ మార్కెట్, అందులో నిరంతరం జరుగుతూ వస్తోన్న మార్పు- చేర్పులూ.. ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో భారత్ ని అతి పెద్ద రెండో ఆర్ధిక శక్తి గా నిలపగలదని అంచనా వేస్తోంది గోల్డ్ మన్ సాక్స్.
చాప్టర్- 5.. జనాభా వృద్ధి యువత, వృద్ధాప్య స్థితిగతులు
ఈ నివేదిక 21వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ప్రపంచ ఆర్ధిక స్థితిగతులపై ఒక స్పష్టమైన సందేశాన్నిస్తుంది. చైనా, యూఎస్ కన్నా ఎంతో ఎక్కువ వేగంతో దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రెండు దేశాల మధ్య గల జనాభా సంఖ్యలోని తేడాగా తెలుస్తోంది.
యూఎస్ లో యువతతో కూడిన జనాభా నిర్మాణాన్ని కొనసాగిస్తూనే.. ఇటు శ్రామిక శక్తి, అటు ఆవిష్కరణలు, ఆపై ఉత్పాదకతను నిలుపుకుంటూ వస్తుందని ఒక అంచనా. ఆపై చైనా సంగతి చూస్తే తన జనాభాలో వృద్ధులను ఎక్కువగా కలిగి ఉండటం.. మైనస్ పాయింట్ గా తెలుస్తోంది. ఇది చైనా ఎదుర్కోబోయే అతి పెద్ద సమస్యగానూ కనిపిస్తోంది. దీంతో చైనా శ్రామిక సామర్ధ్యం తగ్గేలా తెలుస్తోంది. ఇవన్నీ చైనా దీర్ఘకాలిక వృద్ధిపై ప్రభావం చూపొచ్చనే అంచనాలున్నాయి. వీటిని డ్రాగన్ దేశం ఎలా అధిగమిస్తుందో తెలియాల్సి ఉంది.
చాప్టర్- 6.. ఫ్యూచర్ స్టార్స్ గా వర్ధమాన మార్కెట్లు
ప్రపంచంలో మొదటి మూడు ఆర్ధిక వ్యవస్థలకు అతీతంగా.. అనూహ్యమైన కొన్ని అంచనాలను తెరపైకి తెచ్చింది గోల్డ్ మన్ సాక్స్. 2075 నాటికి ప్రపంచంలోని పది పెద్ద మార్కెట్లలో ఏడు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే ఉన్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, టెక్నాలజీ యూజ్ అనే పలు కీలకాంశాల కారణంగా ఈ దేశాలు అనూహ్యంగా తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఫలితాలు వాటంతట అవే రావని చెబుతోందీ రిపోర్ట్. ఈ వర్ధమాన మార్కెట్లు ఇంతగా దూసుకురావడానికి గల కారణం.. అవి ఎంతో పటిష్టమైన ఆర్ధిక విధి విధానాలను అవలంభిస్తూ రావడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆర్ధిక వ్యవస్థలు తమ సామర్ధ్యాన్ని నిరంతరాయంగా మార్చుకోవాలంటే జనాభా, మార్కెట్ పరిణామానికి తగిన పాలనా స్థిరత్వం కూడా కొనసాగించాలని అంటోందీ రిపోర్ట్.
ప్రస్తుతం అభివృద్ధి చెందుతోన్న ఆర్ధిక వ్యవస్థలు ఎంతో తెలివైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది అంతా. ఇందులోని ప్రధాన సూత్రం- స్తూలమైన ఆర్ధిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం. ఇక పోతే ఓపెన్ మార్కెట్, పోటీ మార్కెట్లను ప్రారంభించడం. ఇందులో మానవ మూలధనంలో పెట్టుబడులు, ఆపై చట్టబద్ధమైన పాలనను సంరక్షించుకోవడం వంటివి దాగి ఉన్నాయి. ఇవేవీ లేకుండా అంచనాలకు ఆధారమైన జనాభా, నిర్మాణాత్మక ప్రయోజనాలు వాస్తవ రూపం దాల్చక పోవచ్చని అంచనా వేస్తుంది గోడ్ మన్ సాక్స్.
భవిష్యత్ విజయానికి బలమైన సంస్థలు కేంద్రాలవుతాయి. వీటిలో సమర్ధవంతమైన వ్యవస్థలు, పారదర్శక పాలన, బయటి నుంచి వచ్చే ఒడిదుడుకులను తట్టుకోగల వ్యవస్థలున్నాయి. ఇవే గోల్డ్ మన్ సాక్స్ అంచనాకన్నా మించిన మద్ధతునిస్తాయి. అంచనాలకన్నా మించిన ఫలితాలు రాబట్టాలంటే.. అందుకు అవసరమైన సంస్కరణలు, సంస్థాగత బలోపేతం ఎక్కువ అవసరం..
చాప్టర్- 8.. ప్రభుత్వాలు- పెట్టుబడిదారులపై ప్రభావాలు
ఇక్కడ గోల్డ్ మన్ సాక్స్ ఏం చెబుతోందంటే.. ప్రపంచ ఆర్ధిక శక్తిలో ఊహించిన మార్పులకు అనుగణంగా.. ఆయా దేశాలు తమ తమ వృద్ది వ్యూహాలను సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. అగ్రభాగానికి చేరుకోగలవని భావిస్తున్న దేశాలు.. తమ అభివృద్ధికి అనువుగా మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సేవల విస్తృతి, కొన్ని కొన్ని ప్రణాళికలు సైతం రూపొందించుకోవాలి.
సరిగ్గా అదే సమయంలో.. ఈ ర్యాంకుల్లో క్షీణతను ఎదుర్కుంటున్న అభివృద్ధి చెందిన దేశాలు.. ఆయా దేశాలకు చెందిన వాణిజ్యం, పెట్టుబడి, ఇతర విదేశాంగ విధానాలను పునఃసమీక్ష చేసుకోవాలని సూచిస్తోందీ నివేదిక. ప్రపంచ మార్కెట్లను అనువుగా తమ విధి విధానాలను రూపకల్పన చేసుకోవాలి. అప్పుడే దీర్ఘకాలిక పెట్టుబడులను ఈ వర్ధమాన దేశాలు ఆకర్షించగలవని అంటుందీ రిపోర్ట్. భారత్, ఇండోనేషియా దేశాలు.. గోల్డ్ మన్ సాక్స్ చెప్పినట్టూ అనూహ్య ఫలితాలు రాబట్టాలంటే, ఈ మార్పులను అకళింపు చేసుకోవడం ముఖ్యంగా తెలుస్తోంది. అప్పుడే ఈ దేశాలు మెరుగైన స్థితికి చేరుకుంటాయన్న అంచనాలున్నాయి.
చాప్టర్- 9.. షరతులతో కూడిన భవిష్యత్ మార్పు
మొత్తంగా చూస్తే గోల్డ్ మన్ సాక్స్.. అంచనాలు చెప్పేదేంటంటే.. 2050- 2075 మధ్య కాలం నాటికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో.. అభివృద్ధి చెందిన దేశాలకన్నా చెందుతున్న దేశాలనే ఎక్కువ మార్పు చేర్పులకు లోనవుతాయని అంటోంది. చైనా అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించి.. సుదీర్ఘ కాలం కొనసాగుతుందని అంటుంది గోల్డ్ మన్ సాక్స్. ఇక భారత్- యూఎస్ మధ్య పోటీ.. టాప్ త్రీ పొజిషన్లను నిర్ణయిస్తుందని చెబుతోంది.
అలాగని ఇదేమంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదు. విధానపరమైన నిర్ణయాలు, సంస్థాగత పరిణామ క్రమంపై ఇవన్నీ ఆధారపడి ఉంటాయని అంటోందీ నివేదిక. జనాభా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ.. అదే అసలు విషయం కాదు. ఇందుకు తగిన పటిష్ట పాలనా పరిస్థితులు.. నిరంతర సంస్కరణలు, వ్యూహాత్మకమైన పెట్టుబడులు తోడుగా ఉండాలి. ఇందువల్ల.. మాత్రమే ఈ అంచనాలు నిజమయ్యే ఛాన్సుంది. అంతే కానీ అంచనాలు ఎలాగూ ఉన్నాయి కదాని, నిర్లక్ష్యం చేస్తే అదేమంత వర్కవుట్ అయ్యే పని కాదు. ఇది కేవలం ఒక ఎసెస్మెంట్ మాత్రమే. మిగిలినదంతా ఆయా దేశాల పాలకులు, వారు తీసుకునే విధి విధానాలపై ఆధారపడి ఉంటుందని అంటుంది గోల్డ్ మన్ సాక్స్ నివేదిక.
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
బ్రహ్మోస్ ప్రయోగించకుండానే.. టర్కీని ఆటాడుకుంటోన్న ఇండియా
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..