
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తన మార్క్ నిర్ణయాలతో జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన గంభీర్, పలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తన మార్క్ నిర్ణయాలతో జట్టు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన గంభీర్, పలు కీలక విషయాలపై స్పష్టతనిచ్చాడు. ముఖ్యంగా టెస్టుల్లో మూడో స్థానం కోసం యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని, అతడికే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశాడు.ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. "సాయి సుదర్శన్‌కు గతంలో సరైన అవకాశాలు రాలేదు, అతడికి న్యాయం జరగలేదు. అతను ఎక్కువగా ఇంగ్లండ్‌లో ఆడాడు. కేవలం 4-5 మ్యాచ్‌ల ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడిని అంచనా వేయలేం. ఐపీఎల్లో అతను 700 పరుగులు చేశాడు. అతడి ఫామ్ అద్భుతంగా ఉంది. అందువల్ల దేవదత్ పడిక్కల్ కంటే ముందు సుదర్శన్‌కు సరైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని స్పష్టం చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టెస్టులో సుదర్శన్ ఆడటం దాదాపు ఖాయమైంది.రాబోయే శ్రీలంక పర్యటన గురించి గంభీర్ తన ప్రణాళికలను వివరించాడు. లంక పర్యటనకు నలుగురు స్పిన్నర్లతో వెళతామని, ప్రస్తుతం జట్టులో నాలుగో స్పిన్నర్ స్థానం కోసం మానవ్ సుతార్, హర్ష్ దూబే మధ్య పోటీ ఉందని తెలిపాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే ఈ మ్యాచ్ వారిద్దరిలో ఎవరు మెరుగ్గా రాణిస్తారో అంచనా వేయడానికి ఒక అవకాశమని అన్నాడు. "మానవ్, హర్ష్ బౌలింగ్ శైలిలో కొన్ని సారూప్యతలు, కొన్ని తేడాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ ద్వారా నాలుగో స్పిన్నర్‌ను ఎంపిక చేస్తాం" అని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ వంటి