
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది
ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి కనెక్టివిటీని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా పుణ్యక్షేత్రమైన వారణాసికి విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చింది.ఈ కొత్త విమాన సర్వీసు ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఇండిగో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరిన విమానం, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6:20 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. ప్రయాణ టికెట్ ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్య ఉంటుందని అంచనా.కొత్త ఏవియేషన్ పాలసీతో భారీ లక్ష్యాలుఈ కొత్త సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగంపై పెడుతున్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 2026 నుంచి 2031 వరకు అమల్లో ఉండేలా నూతన ఏవియేషన్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా విమానయాన రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి ఏరోస్పేస్ తయారీ రంగంలో సుమారు రూ.9,575 కోట్లకు (1 బిలియన్ డాలర్లు) పైగా పెట్టుబడులను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంతో పాటు ఎంఆర్వో (MRO),