
ఇంటర్నెట్‌డెస్క్: వైమానిక దళాన్ని బలోపేతం చేసే దిశగా ఐదోతరం యుద్ధ విమానాన్ని అమ్ములపొదిలో చేర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇంటర్నెట్‌డెస్క్: వైమానిక దళాన్ని బలోపేతం చేసే దిశగా ఐదోతరం యుద్ధ విమానాన్ని అమ్ములపొదిలో చేర్చుకునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) నుంచి బిగ్ ఆఫర్ వచ్చింది. అధునాతన స్టెల్త్ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్ ఎస్‌యూ-57 యుద్ధవిమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి, ఉత్పత్తి చేయడానికి, అలాగే కీలక సాంకేతికతలను పంచుకోవడానికి రష్యా సుముఖంగా ఉందని వెల్లడించారు. సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తాసంస్థల అధినేతలతో మాట్లాడిన సందర్భంగా అధ్యక్షుడు ఈ ప్రతిపాదన చేశారు.
భారత వైమానిక దళంలో ఐదోతరం యుద్ధ విమానాలు లేవు. మరోవైపు, పాకిస్థాన్ త్వరలో చైనాకు చెందిన షెన్యాంగ్ జె-35AE స్టెల్త్ ఫైటర్స్‌ను సొంతం చేసుకోనుందని వార్తలు వస్తోన్న వేళ రష్యా నుంచి స్పందన రావడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.