
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై తనను తాను మరోసారి ప్రపంచ శాంతిదూతగా అభివర్ణించుకున్నారు. తన పరిపాలనా కాలంలో తాను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా "ఎనిమిది యుద్ధాలను ముగించానని",...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వేదికపై తనను తాను మరోసారి ప్రపంచ శాంతిదూతగా అభివర్ణించుకున్నారు. తన పరిపాలనా కాలంలో తాను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా "ఎనిమిది యుద్ధాలను ముగించానని", ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ త్వరలోనే తొమ్మిదోది అవుతుందని విలేకరుల సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. తన విదేశాంగ విధానం, జాతీయ భద్రతా రికార్డు గురించి మాట్లాడుతూ.. తాను మొదట్లో పెద్దగా జాతీయ భద్రతా అనుభవం లేకుండానే బాధ్యతలు స్వీకరించినప్పటికీ, తన ప్రభుత్వం అంతర్జాతీయంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందని చెప్పుకొచ్చారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగాలని వైట్ హౌస్ ఒత్తిడి తెస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను జాతీయ భద్రతలో పెద్దగా అనుభవజ్ఞుడిని కాదు, కానీ నేనీ విషయంలో నిజంగా గొప్ప పని చేశానని భావిస్తున్నాను. నేను 8 యుద్ధాలను ముగించాను, త్వరలో తొమ్మిదోది కూడా కాబోతోంది. బహుశా ఆ తర్వాత మరో యుద్ధం కూడా ముగిసి, ఆ సంఖ్య పదికి చేరవచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ వ్యూహంపై యూఎస్ కాంగ్రెస్ అసంతృప్తిట్రంప్ ఈ శాంతి వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే.. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతును మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఒక పెద్ద బిల్లుకు ప్రతినిధుల సభ (House of Representatives) ఆమోదం తెలిపింది. డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు గ్రెగరీ మీక్స్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ద్వారా ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణం కోసం బిలియన్