
‘కాక్టెయిల్ 2’లో దియా పాత్ర కోసం మొదట్లో భయపడ్డానని రష్మిక మందన్న తెలిపారు. కెరీర్లో తొలిసారి అల్ట్రా మోడ్రన్ లుక్లో కనిపించనున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో యానిమల్, ఛావా వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత ‘కాక్టెయిల్ 2’ (Cocktail 2) తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు రష్మిక మందన్న (Rashmika Mandanna). షాహిద్ కపూర్ (Shahid Kapoor), కృతిసనన్ (Kriti Sanon), రష్మిక నటించిన ఈ చిత్రాన్ని హోమీ అదజానియా తెరకెక్కించారు. 2012లో వచ్చిన ‘కాక్టెయిల్’కు సీక్వెల్గా ఇది రూపుదిద్దుకుంది. సినిమా ఈనెల 19న విడుదల అవుతోంది. ఇందులో రష్మిక దియా అనే పాత్రను పోషించారు. ఇటీవల ఓ ప్రమోషన్ కార్యక్రమంలో రష్మిక తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట్లో చాలా భయపడ్డాను. ఎందుకంటే కెరీర్లోనే ఇలాంటి అల్ట్రా మోడ్రన్ లుక్లో ఎప్పుడూ కనిపించలేదు. నా పాత సినిమాలు చూసిన ప్రేక్షకులు నా నుంచి శక్తిమంతమైన, బలమైన భావోద్వేగాలున్న నటనను ఆశిస్తారు. కానీ, నేను మొదటి సారి ఇలాంటి ప్రయోగాత్మక రోల్ చేశాను. మొదట్లో నేను ఇలాంటి క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదా? అని సందేహించాను. ఎందుకంటే మునుపెన్నడూ నేను ఇలాంటి పాత్రలు చేయలేదు. కానీ, ప్రేక్షకులకు ఒక కొత్తదనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ క్యారెక్టర్లో నటించాలని ఫిక్స్ అయ్యాను’ అని చెప్పారు
.