
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చారు. తాను క్రికెట్ పరిపాలనా రంగానికి శాశ్వతంగా దూరం కావడానికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి 'డి-కంపెనీ' ముఠా నుంచి వచ్చిన ప్రాణభయమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఐపీఎల్ జట్టుపై పట్టు సాధించడంతో పాటు, భారీగా సాగే అక్రమ బెట్టింగ్ నెట్‌వర్క్‌లను చూసీచూడనట్లు వదిలేయాలంటూ దావూద్ ముఠా తనను తీవ్రంగా బెదిరించిందని మోదీ ఆరోపించారు. జూన్ 4న ప్రసారమైన ఏఎన్ఐ (ANI) ప్రత్యేక ఇంటర్వ్యూలో లండన్ నుంచి మాట్లాడుతూ ఆయన ఈ బాంబు పేల్చారు.లలిత్ మోదీ కథనం ప్రకారం.. ఐపీఎల్ ప్రారంభ సీజన్లలో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వంటి అక్రమాలకు తాను అస్సలు ఒప్పుకోలేదని, అందువల్లే అండర్‌వరల్డ్ ముఠా తనను లక్ష్యంగా చేసుకుందని చెప్పారు. ముఖ్యంగా 2009లో సార్వత్రిక ఎన్నికల భద్రత కారణంగా ఐపీఎల్ రెండో సీజన్‌ను ఒక్క రాత్రిలో దక్షిణాఫ్రికాకు మార్చడం వల్ల.. భారత్‌లో టోర్నమెంట్ రద్దవుతుందని బెట్టింగ్ కాసిన దావూద్ బుక్మేకర్ల సిండికేట్ వేల కోట్లు నష్టపోయిందని, ఆ నష్టాన్ని తన నుంచి వసూలు చేయాలని చూశారని ఆరోపించారు. ఫిక్సింగ్‌కు సహకరిస్తే వందల మిలియన్ డాలర్ల లంచం ఇస్తామని ఆఫర్ చేసినా తాను తిరస్కరించినట్లు తెలిపారు.ఆ రాత్రి ఏం జరిగింది?ఈ వివాదం ముదిరిన తరుణంలో, 2012లో లండన్‌లో జరిగిన ఒక భయానక సంఘటనను మోదీ గుర్తుచేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3:30 గంటల సమయంలో 'బాబా' అనే మధ్యవర్తి ద్వారా లండన్‌లోని ఒక