
ఐపీఎల్ ద్వారా కోట్లు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ మైనర్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలా? Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు.
ఐపీఎల్ ద్వారా కోట్లు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ మైనర్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలా? Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అతడి పేరు మారుమోగుతుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కాంట్రాక్టులు, స్పాన్సర్ షిప్ డీల్స్, ఎండార్స్మెంట్లతో 7 కోట్ల రూపాయలను సంపాదించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మైనర్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలా? అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 18 ఏళ్ల లోపు పిల్లలను మైనర్లుగా పరిగణిస్తారు. వారు సంపాదించే ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంలో కలిపి (“clubbing provisions”) పన్ను విధిస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరికైతే ఎక్కువ పన్ను ఆదాయం ఉంటుందో వారి ఆదాయంతో కలిపి చూపాల్సి ఉంటుంది. సాదారణంగా పిల్లల పేరు మీద చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, పెట్టుబడులు ఈ కోవలోకే వస్తాయి. వైభవ్ సూర్యవంశీ ఇందుకు భిన్నం.. అయితే వైభవ్ సూర్యవంశీ విషయంలో ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. అతని ఆదాయం పెట్టుబడులు లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల వచ్చింది కాదు. అతడి క్రికెట్ ప్రతిభ కారణంగా.. ఐపీఎల్ కాంట్రాక్టులు, స్పాన్సర్ షిప్లు, బ్రాండ్ ఎండార్స్ మెంట్లు వంటివి వాటి ద్వారా సంపాదించాడు. Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్ సూర్యవంశీకి చోటు! ట్యాక్స్ నిపుణుల ప్రకారం.. ఓ మైనర్ తన సొంత ప్రతిభ, ప్రత్యేక నైపుణ్యాలు ద్వారా సంపాదించే ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంలో కలపకూడదు. ఇలా వచ్చిన ఆదాయానికి మైనర్లు వారి పేరు మీదనే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సి ఉంటుంది. మైనర్ల తరుపున వారి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు ప్రతినిధిగా వ్యవహరిస్తూ రిటర్నుల దాఖలు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో వైభవ్ సంపాదనను వైభవ్ సొంత ఆదాయంగానే పరిగణిస్తారు. ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 దాఖలు చేయాల్సి ఉంటుంది. అతడి ఆదాయం కోట్లలో ఉంది కాబట్టి అతడు దాదాపు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.